Jathara Movie: 18 గ్రామాలకు కాపు కాసే దేవత.. విజువల్ వండర్‌గా 'జాతర'

Jathara Movie Updates: జాతర మూవీని కుటుంబ సమేతంగా చూసేలా తెరకెక్కించామని.. ఎక్కడ అసభ్యతకు తావులేదన్నారు ప్రొడ్యూసర్ శివశంకర్ రెడ్డి. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఆసక్తికర విషయాలను ఆయన మీడియాతో పంచుకున్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Nov 7, 2024, 07:04 PM IST
Jathara Movie: 18 గ్రామాలకు కాపు కాసే దేవత.. విజువల్ వండర్‌గా 'జాతర'

Jathara Movie Updates: జాతర మూవీ రేపు (నవంబర్ 8) థియేటర్లలో సందడి మొదలుపెట్టనుంది. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శించగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. సతీష్ బాబు హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహించారు. దీయా రాజ్ హీరోయిన్‌గా యాక్ట్ చేయగా.. రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. చిత్తూరు జిల్లాలో జాతర బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ శివ శంకర్ రెడ్డి ఈ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

Aslo Read: FD Rates: ఈ ప్రైవేటు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా.. అయితే మీకు షాకింగ్ న్యూస్.. ఇకపై మీ జేబుపై కోత తప్పదు.. ఎందుకంటే  

తనకు సినిమాలంటే చాలా ఇష్టమని.. సతీష్ బాబు చెప్పిన పాయింట్ చాలా నచ్చిందన్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథను రాసుకున్నారని.. చాలా బాగా నచ్చడంతో నిర్మించానని చెప్పారు. 18 ఊర్లకు కాపు కాసే గ్రామ దేవత కథ అని.. ఆ గ్రామాల చుట్టూ కథ తిరుగుతుందన్నారు. మూవీ హై స్టాండర్డ్‌లో విజువల్ వండర్‌గా ఉంటుందన్నారు. ప్రసాద్ కెమెరా వర్క్, ప్రణవ్ సంగీతం, ఆర్ఆర్ సినిమాను మరోస్థాయిలో నిలబెడతాయన్నారు. ఈ సినిమాను మూడు షెడ్యూల్స్‌లో 73 రోజుల పాటు షూట్ చేశామన్నారు.

చిత్రీకరణ జరుగుతున్న అన్ని రోజులు వర్షం కురిసిందని.. అయితే ఎప్పుడు కూడా షూటింగ్‌కు అంతరాయం ఏర్పడలేదన్నారు. పాలేటమ్మ మహిమతోనే అంతరాయం కలగేదని తాను నమ్ముతానని అన్నారు. ఈ సినిమా కోసం అందరూ కొత్త వాళ్లే పనిచేశారని.. అయితే చాలా అనుభవం ఉన్న వాళ్లు తీసిన మూవీలా ఉంటుందన్నారు. ఎక్కడా అసభ్యతకు చోటు ఉండదని.. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమన్నారు.

సెన్సార్ సభ్యులు ఎక్కడా కూడా కట్స్‌ చెప్పలేదని.. చివరి 20 నిమిషాలు ఓ రేంజ్‌లో ఉందని ప్రశసించారని శివశంకర్ రెడ్డి తెలిపారు. ప్రీమియర్‌ షోలకు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. హీరోగా, దర్శకుడిగా సతీష్‌ బాబు న్యాయం చేశారని చెప్పారు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని మెచ్చుకున్నారు. ఇటీవల ఇలాంటి సబ్జెక్ట్‌తో సినిమా రాలేదని.. చాలా ఫ్రెష్‌గా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందన్నారు. 

Also Read: YS Sharmila: వర్రా రవీంద్రా రెడ్డి అనే సైకో నా పుట్టుకను అవమానించాడు: వైఎస్‌ షర్మిల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

Trending News