Karthika masam 2024: కార్తీక మాసంలో నదీ స్నానం, ఆకాశ దీపం ప్రాముఖ్యత ఏంటో తెలుసా..?

karthika masam puja: కార్తీక మాసంను దామోదర మాసంగా కూడా చెప్తుంటారు. ఈ మాసంలో మనం చేసే ప్రతి పూజ కూడా వంద రెట్లు ఎక్కువ ఫలితాలు ఇస్తుందని చెప్తుంటారు.  అందుకే కార్తీకంలో కొన్ని ప్రత్యేకంగా పూజలు నిర్వహించాలని పండితులు చెబుతుంటారు.

1 /5

కార్తీక మాసంలో ఏ పనిచేసిన, ఎలాంటి పూజలు చేసిన అది వెయ్యిరెట్లు ఎక్కువ మంచి ఫలితాలను ఇస్తుంది. అంతే కాకుండా.. ఈ నెల రోజులు పాటు ప్రతి రోజు దీపారాధన, నదీ స్నానం, ఆకాశ దీపం వెలిగించాలని చెబుతుంటారు.  

2 /5

చాలా మంది పండితులు కార్తీకంలో దీపారాధన చేస్తే గత జన్మలో చేసుకున్న పాపాలు అన్ని దూరమౌతాయని చెబుతుంటారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా పూజాధికాలు చేయాలంటుంటారు.  

3 /5

కార్తీకంలో చాలా మంది నదులకు వెళ్లి గంగా స్నానం చేస్తుంటారు. ఈ కాలాన్ని పర్వకాలంగా చెప్తుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో గంగా నదీలో దేవతలు వచ్చి నివాసం చేస్తారని అంటారు.  

4 /5

ఆకాశంలో సూర్యొదయంకు ముందు దీపారాధన చేస్తే వంద రేట్లు పుణ్యం వస్తుందంట. అంతే కాకుండా.. మనం తెలిసి లేదా తెలియక చేసుకున్న పాపాలు..దీపాల వెలుతురుగా దూరంగా పోతాయంటారు.  

5 /5

మరికొందరు కార్తీకంలో వనభోజనాలకు సైతం వెళ్తుంటారు. ఆషాడంలో నిద్రలోకి వెళ్లిన విష్ణుదేవుడు.. కార్తీకంలో ఏకాదశి రోజు మేల్కొంటారని అందుకు కార్తీకంకు అంతని పవిత్రత ఉంటుందని చెప్తుంటారు.