US Election 2024 Results: అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో రిపబ్లిక్ అండ్ పార్టీ విజయం వైపుగా దూసుకెళ్తోంది. అమెరికా అధ్యక్షుడుగా మరోసారి డోనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమం అవుతుంది. అటు డోనాల్డ్ ట్రంప్ గెలుపు నేపథ్యంలో అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా మార్కెట్ సూచి డో జోన్స్ 1.02 శాతంతో లాభపడింది. నాస్టాక్ సూచీ 1.4 శాతం లాభపడింది. S&P సూచీ 1.23 శాతం లాభపడింది. దీనికి తోడు భారత స్టాక్ మార్కెట్లు సైతం లాభాల్లోకి వస్తున్నాయి.
ముఖ్యంగా ఐటీ కంపెనీలో అయినా టిసిఎస్, ఇన్ఫోసిస్, HCL చొప్పున 3 శాతం పైగా లాభపడింది. అలాగే ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డిస్ లాబ్స్ సైతం 3 శాతం లాభపడింది. డోనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే భారత్ అమెరికా మధ్య వాణిజ్య బంధం బలపడుతుందని పలువురు వాణిజ్య విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి, డోనాల్డ్ ట్రంప్ మధ్య వ్యక్తిగతంగా కూడా మంచి పరిచయాలు ఉన్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ముందుకు వెళ్లే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
Also Read: Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..లేదంటే భారీగా నష్టపోతారు
చైనాకు చెక్.. భారత్ కు జోష్:
డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయితే చైనా ఆధిపత్యానికి చెక్ పడే అవకాశం ఉందని, విశ్లేషకులు భావిస్తున్నారు. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ తో వాణిజ్య సంబంధాలు కుదుర్చుకునేందుకు, డోనాల్డ్ ట్రంప్ ఉత్సాహం చూపిస్తారు. గతంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు కూడా చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ తో వాణిజ్య సంబంధాలు బలపరుచుకునేందుకు అమెరికా మొగ్గు చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీనికి తోడు ఆసియాలో అమెరికాకు ఇకపై శాశ్వత మిత్రుడిగా భారత్ నిలిచే అవకాశం ఉందని విదేశాంగ నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ జరుపుకుంటున్న అమెరికా కంపెనీలు, ఇకపై తమ పెట్టుబడులను భారత్ వైపు తరలించే అవకాశం కూడా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
డోనాల్డ్ ట్రంప్, మోదీ స్నేహంతో ఇరు దేశాల వాణిజ్య బంధానికి మరింత బలం:
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య బలమైన స్నేహం ఉందని అంతర్జాతీయ సమూహాల్లో కూడా చర్చ నడుస్తోంది. దీంతో అటు చైనా పక్కకు పెట్టి ఇకపై భారత్ తోనే వాణిజ్య భాగస్వామిగా అమెరికా చెట్టా పట్టాలు వేసుకొని తిరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే డోనాల్డ్ ట్రంప్ గతంలో H1b వీసాల విషయంలో కఠిన వైఖరి వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి డోనాల్డ్ ట్రంప్ అలాంటి వైఖరి తీసుకోకపోవచ్చు అని భారతీయ విశ్లేషకులు ఐటి కంపెనీ ప్రతినిధులు భావిస్తున్నారు.
Also Read: Hyderabad: యువతకు సువర్ణావకాశం.. నవంబర్ 9న నాంపల్లిలో మెగా జాబ్ మేళా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.