చుట్టూ నాలుగుపక్కల సముద్రం, ప్రపంచానికి దూరంగా ఉంటూ ఉండే ఫ్రెంచ్ పాలినేషియా ద్వీపం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఏంటా వార్తా అంటే ఆ ద్వీపం ప్రతిష్టాత్మకమైన నగరాన్ని నిర్మించనుంది. ఏ భూమిపైనో దానిని నిర్మిస్తే అంత పెద్ద విషయం కాదు.. కానీ సముద్రంపై నిర్మించనుంది అదే పెద్ద విషయం.
ఇందుకోసం ఏకంగా 1135 కోట్లు ఖర్చుపెట్టి సముద్రంలో తేలియాడే నగరాన్ని నిర్మించనుంది. ఫ్రెంచ్ పాలినేసియన్ ద్వీపంలో ప్రభుత్వం అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కో కు చెందిన సీస్టీడింగ్ ఇన్స్టిట్యూట్ తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఈ ప్రాజెక్టును పసిఫిక్ మహా సముద్రం మధ్యలో నిర్మించనుంది. నిర్మాణ పనులను 2019లో మొదలుపెడతారు. ఈ నగరంలో 300 ఇల్లు నిర్మించాలని నిర్ణయించారు. అంతేనా ఆ నగరంలో విద్యాసంస్థలు, వ్యవసాయం, హాస్పిటల్స్, ఆక్వాకల్చర్, విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటుచేయనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రపంచంలో సముద్రంలో తేలియాడే ననగరాన్ని నిర్మించిన మొట్టమొదటి ద్వీపముగా చరిత్రలో నిలుస్తుంది.