AP TET 2024 Results: ఆంధ్రప్రదేశ్ టెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ టెట్ 2024 పరీక్ష ఫలితాలు https://aptet.apcfss.inలో చూసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,68,661 మంది పరీక్షకు హాజరు కాగా 1.87 లక్షలమంది అర్హత సాధించారు. మరోవైపు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో వెలువడనుంది.
ఏపీ టెట్ 2024 ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,68,661 మంది టెట్ పరీక్ష రాయగా 86.28 శాతం అంటే 1.87 లక్షలమంది క్వాలిఫై అయ్యారు. నిరుద్యోగులకు మాట ఇచ్చినట్టుగానే త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.
ఏపీ టెట్ పరీక్ష 2024 అక్టోబర్ 3 నుంచి 21 వరకూ జరిగాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసింది. ఇందులో భాగంగా 16,347 టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రేపు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. డీఎస్సీలో మరింత మందికి అవకాశం కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం తాజాగా మరోసారి టెట్ పరీక్ష నిర్వహించింది. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి నిబంధనల ప్రకారం 1-8వ తరగతి బోధించాలంటే టెట్ అర్హత తప్పనిసరి. ఒకసారి టెట్ పరీక్ష ఉత్తీర్ణులయితే జీవితాంతం ఎప్పుడైనా డీఎస్సీ రాయవచ్చు. టెట్ పరీక్ష రెండు రకాలుగా ఉంటుంది. పేపర్ 1 ఉత్తీర్ణులయినవారు 1-5 తరగతులకు బోధించే ఎస్జీటీ పోస్టులకు పేపర్ 2లో అర్హత సాధిస్తే 6,7,8 తరగతులకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. డీఎస్సీలో టెట్ పరీక్షకు 20 శాతం వెయిటేజ్ ఉంటుంది.
అందుకే డీఎస్సీ పరీక్షకు రాసే అభ్యర్ధులకు టెట్ పరీక్షకు చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. అక్టోబర్ 3 నుంచి 21 వరకూ జరిగిన టెట్ పరీక్ష ఫలితాలు https://aptet.apcfss.in ఇలా చెక్ చేసుకోవచ్చు.
ఏపీ టెట్ అధికారిక వెబ్‌సైట్ https://aptet.apcfss.in ఓపెన్ చేసి అందులో AP TET 2024 Results లింక్ క్లిక్ చేయాలి. ఇప్పుడు అక్కడ అడిగిన వివరాలు ఎంటర్ చేస్తే ఫలితాలు స్క్రీన్‌పై కన్పిస్తాయి.
Also read: NEET Exam Pattern: నీట్ పరీక్ష విధానంలో మార్పు, ఇకపై జేఈఈ తరహాలో రెండంచెల్లో పరీక్ష
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.