Samantha Ruth prabhu: నటి సమంతా రూత్ ప్రభు మరోసారి వార్తలలో నిలిచారు. ఆమె తాజాగా, రాజస్థాన్ లోని రణ థంబోర్ నేషనల్ పార్కు కు వెళ్లారు. అంతేకాకుండా అక్కడ కోటలో దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నట్లు తెలుస్తొంది.
అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ లు తొందరలోనే పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్న విషయం తెలిసిందే. వీరి ఎంగెజ్ మెంట్ అయినప్పటి నుంచి కూడా సమంతా మళ్లీ ట్రెండింగ్ గా మారారు. అయితే.. సమంతను ఇటీవల తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదస్పద వ్యాఖ్యలతో మళ్లీ వార్తలలో నిలిచారు.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్ని సమంతా ఖండించిన విషయం తెలిసిందే. ఆమెకు సినిమా ఇండస్ట్రీ అంతా బాసటగా నిలిచింది. ఇదిలా ఉండగా.. నటి సమంతా ఏమాయ చేశావే మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అనూహ్యంగా నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి జరిగిపోయాయి.
ఆ తర్వాత వీరి వ్యవహారం విడాకుల వరకు కూడా వెళ్లిపోయింది. ఈ క్రమంతో నటి సమంతా కొన్నినెలలకు మయోసైటిస్ వ్యాధికి కూడా గురయ్యారు. కొంత మంది నెటిజన్ లు మాత్రం సమంతాను తరచుగా ట్రోల్స్ చేస్తునే ఉన్నారు. అయితే.. మంత్రి కోండా సురేఖ ఘటన తర్వాత జిగ్రా మూవీ రిలీజ్ ఈవెంట్ కు సమంతా హైదరబాద్ కు వచ్చారు.
అప్పుడు మళ్లీ తన మనస్సులో మాటను అభిమానులతో పంచుకున్నారు. త్రివిక్రమ్ , ఆలియా భట్ లు సమంతాపై పొగడ్తల వర్షం కురిపించారు. అయితే.. సమంతా తాజాగా, రాజస్థాన్ కు వెళ్లినట్లు తెలుస్తొంది. ఆమె రణ థంబోర్ అడవిలో సరదగా గడిపారు. అంతే కాకుండా.. అక్కడ కోటలో దీపావళిని సెలబ్రేట్ చేసుకున్ననట్లు తెలుస్తొంది.
ఒక వైపు రణ థంబోర్ కోట అందాలను ఎంజాయ్ చేస్తునే.. పచ్చని వెదర్ మధ్య ఉన్న రణథంబోర్ నేషనల్ నేషనల్ పార్కులో ఉన్న జంతువులు, కోతులు, వెరైటీ పక్షులను చూస్తు కాస్తంతా సేదతీరినట్లు తెలుస్తొంది. ఇదిలా ఉండగా తాజాగా, సమంతా రణ థంబోర్ కోట, అడవిలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గామారాయి.
సమంతా విజయ్ దేవర కొండతో.. ఖుషీ మూవీ చేశాక తెలుగులో మరో ప్రాజెక్ట్ చేయలేదు. ప్రస్తుతం వరుణ్ ధావన్ తో సమంతా నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరిస్ నవంబరు 7 ఆడియన్స్ ముందుకు రానున్నట్లు తెలుస్తొంది.