Karthika Masam 2024: ప్రసిద్ద పుణ్యక్షేత్రమైనా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం వేడుకలు ప్రారంభమయ్యాయి. కార్తీక మాసo మొదటిరోజు ఉదయాన్నే భక్తులు స్వామి వారి రావిచెట్టు వద్ద కార్తీక ద్వీపాలు వెలిగించి స్వామి వారిని దర్శించుకున్నారు. కార్తీక మాసంలో రాజన్నను దర్శించుకోవడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా జీవితంలో సమస్యలు తొలగిపోతాయని ఆలయ అర్చకులు తెలిపారు. రాజన్న ఆలయం భక్తుల రద్దీతో సందడిగా మారింది. నేటి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామికి నెలరోజుల పాటు కార్తీక మాసం ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు.
కార్తీక మాసంలో వచ్చే నాలుగు సోమవారాలు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం అద్దాల మండపంలో మహా లింగార్చన, మూడో సోమవారం భీమేశ్వరాలయంలో మహాలింగార్చన, పరివార దేవదార్చనలు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. కార్తీక శుద్ధ చతుర్దశి రోజున స్వామివారికి, అనుబంధ ఆలయాల్లో అన్న పూజలు, సాయంత్రం భీమేశ్వర స్వామి వారికి ప్రదోష పూజ, పౌర్ణమి రోజున రాత్రి జ్వాలతోరణం, మహా పూజను ఆలయ అర్చకులు వేదమంత్రాలతో నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. కార్తీక మాసం సందర్భంగా రాజన్న ఆలయంలో నెల రోజుల పాటు సాయంత్రం రెండు గంటల పాటు దీపారాధనతో పాటు సాంస్కృక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ప్రతి సోమవారంతో పాటు ఏకాదశి పౌర్ణమి రోజులలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతములు రెండు నుంచి మూడు సార్లు నిర్వహించబోతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. బుధవారం 13వ తేది కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఉదయం 6.30 నిమిషాలకు శ్రీరుక్మిణి, విఠలేశ్వరస్వామివారికి పంచోపనిష అభిషేకం చేయబోతున్నట్లు వెల్లడించారు. ఇక సాయంత్రమం 6: 35 నిమిషాల నుంచి శ్రీకృష్ణతులసీ కళ్యాణము నిర్వహించనున్నారు. కార్తీకశుద్ధ త్రయోదశి ఉపరి చతుర్దశి రోజున వైకుంఠ చతుర్దశి సందర్భముగా శ్రీఅనంతపద్మనాభ స్వామివారికి పంచోపనిషత్ అభిషేకం జరపబోతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
ఉదయం 10 గంటల నుంచి ప్రధాన, పరివార శివాలయాల్లో అన్నపూజలు కూడా జరపబోతున్నట్లు ఆలయ కటిమిటీ తెలిపింది. ఆ తర్వాత సాయంత్రం 6.00 నిమిషాల నుంచి శ్రీ అనంతపద్మనాభ స్వామి వారికి అభిషేకం చేసి.. అనంతరం శ్రీవల్లీదేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి మహాపుజ, పొన్నచెట్టుసేవ ఊరేగింపు జరపబోతున్నట్లు వెల్లడించారు. ఇక 15వ శుక్రవారం కార్తీక పౌర్ణమి రోజున ప్రదోషకాల పూజ అనంతరం రాత్రి 7.30 నిమిషాలకు జ్వాలా తోరణ పూజతో పాటు రాత్రి నిశీపూజ చేయనున్నారు. ఆ తర్వాత రాత్రి 10.15నిమిషాల నుంచి శ్రీరాజరాజేశ్వరస్వామి వారికి మహాపూజ నిర్వహించనున్నారు.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.