Gautam Adani: అదానీ భార్య ఎవరో తెలిస్తే మీ నోటి నుంచి మాట రమ్మన్నా రాదు..ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

Gautam Adani: ప్రపంచంలోని  బిలియనీర్ల జాబితాలో భారత్ కు చెందిన గౌతమ్ అదానీ ఒకరు. అదానీ నికర విలువ 83.26 బిలియన్ల డాలర్లుగా ఉంది. ఆయన భార్య ప్రీతి అదానీ గురించి మీకు తెలిస్తే మీరు షాక్ అవుతారు   

Written by - Bhoomi | Last Updated : Oct 30, 2024, 05:24 PM IST
Gautam Adani: అదానీ భార్య ఎవరో తెలిస్తే మీ నోటి నుంచి మాట రమ్మన్నా రాదు..ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

Gautam Adani Story: ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది. అదానీ విజయం వెనక ఆయన భార్య ప్రీతి ఉన్నారు. ప్రపంచంలోనే బిలియనీర్ల జాబితాలో అదానీ ఒకరు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 18వ స్థానంలో కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అదానీ నికర విలువ 83.26 డాలర్లుగా ఉంది.ఒకప్పుడు అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ స్థానాన్నికూడా అధిగమించాడు. అయితే అదానీ భార్య ప్రీతి అదానీ గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానీ ఓ డెంటిస్ట్. అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ భార్య అయినాకూడా..ఆమె ఓ సాధారణ జీవశైలికి చెందిన వ్యక్తి. ధనిక వ్యాపారవేత్త భార్యగానే కాదు..ప్రీతి స్వయంగా విద్యావేత్త. ఆమె అదానీ గ్రూపునకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ హెడ్ కూడా ఉన్నారు. ప్రీతి అదానీ సాధారణ చీరలు, సల్వార్ సూట్స్ ధరిస్తుంటారు. సాదా రంగు కాటన్ చీరలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. లైట్ సల్వార్ కమీజ్ సూట్ లో పబ్లిక్ గా కనిపిస్తారు. 

డా. ప్రీతి అదానీ గుజరాతీ కుటుంబంలో 1965లో జన్మించారు. ప్రీతి కుటుంబం విలువలు, విద్య సేవకు ప్రాముఖ్యతను ఇచ్చింది. ప్రీతి అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ డెంటల్ కాలేజీలో డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. చదువు పూర్తయ్యాక, ప్రీతి 1986లో గౌతమ్ అదానీని వివాహం చేసుకుంది. ఇది ఆమె జీవితంలో కొత్త మలుపు తిరిగింది.

డాక్టర్ ప్రీతి అదానీ 1996లో ఫౌండేషన్‌ను స్థాపించారు. ఇది ఒక NGO, ఇది భారతదేశంలో అతిపెద్ద,  అత్యంత ప్రభావవంతమైన సంస్థలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ ఫౌండేషన్ లక్ష్యం పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య కనిపించని దూరాన్ని, అంతరాన్ని తగ్గించడం. ఈ సంస్థ అనేక రంగాలలో పని చేసింది. అదానీ ఫౌండేషన్ భారతదేశంలోని 18 రాష్ట్రాలలో 5,753 కంటే ఎక్కువ గ్రామాలలో పని చేస్తుంది. ప్రజలకు లెక్కలేనన్ని సేవలను అందిస్తోంది. 

ఈ సంస్థ విద్య, ప్రజారోగ్యం, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్థిరమైన జీవనోపాధి మొదలైన రంగాలలో పనిచేస్తుంది. అక్షరాస్యత, విద్యా అవకాశాలను మెరుగుపరచడం ఈ సంస్థ  లక్ష్యం. ఆరోగ్య సంబంధిత సేవలను సులభంగా,మెరుగ్గా పొందడమే కాకుండా, ఈ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు, వనరులు  నైపుణ్యాభివృద్ధికి కూడా పని చేస్తుంది.

Also Read : Business Ideas: తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ తెలియని, 365 రోజులు డిమాండ్ ఉన్న బిజినెస్ ఇదే..నెలకు రూ. 1 లక్ష పక్కా  

డా. ప్రీతి తన పనితో గ్రామీణ ప్రాంతాలను ప్రభావితం చేయడమే కాకుండా విద్య, CSR లో కూడా ముఖ్యమైన కృషి చేసింది. 2020లో గుజరాత్ లా సొసైటీ యూనివర్శిటీ ఆమెకు డాక్టరేట్ ప్రదానం చేసింది. ఇందులో సమాజాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి ఆమె చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అంతేకాదు ప్రీతి ఒక ఆదర్శ భార్య బాధ్యతలను కూడా చాలా చక్కగా నిర్వహిస్తోంది. గౌతమ్ అదానీ తన విజయానికి తన భార్యే కారణమని ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అంతేకాదు అదానీ కంటే ఆయన భార్యే ఎక్కువ చదువుకున్నారు. ఓ సందర్భంలో గౌతమ్ అదానీ మాట్లాడుతూ నేను 10వ తరగతి పాస్..కాలేజీ డ్రాప్ అవుట్. ప్రీతి క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టిషనర్..ఆమె డాక్టర్. ఆమె నాకంటే ఎక్కువ క్వాలిఫైడ్ అయినా నన్ను పెళ్లి చేసుకోవాలని ధైర్యంగా నిర్ణయం తీసుకుంది. నా విజయానికి కారణం ఎవరని అడిగితే...నేను నా భార్య ప్రీతి అని చెబుతాను అని చెప్పారు. 

వీరికి ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడు కరణ్ అదాన్ అదానీ పోర్ట్స్, సెజ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్. రెండవ కుమారుడు జీత్ అదానీ ..అదానీ గ్రూప్ లో ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్. గౌతమ్ అదానీ ఏ సంపన్న కుటుంబం లోనుంచి రాలేదు. ఆయన ఉన్నత స్థాయికి ఎదిగి అదానీ గ్రూప్ ను స్థాపించారు. అహ్మదాబాద్ లోని మధ్య తరగతి కుటుంబానికి చెందిన గౌతమ్ పాఠశాల విద్య తర్వాత కామర్స్ డిగ్రీలో చేరాడు. కొన్ని కారణాల వల్ల ఆయన డిగ్రీ పూర్తి చేయలేదు. అదానీ పెద్దగా చదువుకోలేదు. 

Also Read : Free Gas Cylinder: మహిళలకు దీపావళి పండుగే.. ఉచిత గ్యాస్‌ సిలిండర్లకు చెక్కు అందజేత

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News