Most Powerful Vivo Smartphone: 210W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్ట్‌‌తో Vivo నుంచి శక్తివంతమైన మొబైల్.. ఇది గూగుల్‌ ఫోన్‌ కాదు!

Vivo Most Powerful New Smartphone: వీవో నుంచి మరో అద్భుతమైన ఫోన్‌ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం లుక్‌తో పాటు అద్భుతమైన కెమెరా ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు శక్తివంతమైన ప్రాసెసర్‌పై రన్‌ అవుతుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Oct 26, 2024, 03:40 PM IST
Most Powerful Vivo Smartphone: 210W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్ట్‌‌తో Vivo నుంచి శక్తివంతమైన మొబైల్.. ఇది గూగుల్‌ ఫోన్‌ కాదు!

Vivo Most Powerful New Smartphone: వీవో (Vivo) నుంచి మార్కెట్‌లో మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ Vivo V50 Pro 5G పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఎంతో పవర్‌ ఫుల్ బ్యాటరీతో పాటు ప్రొఫెషనల్-గ్రేడ్ కెమెరా సిస్టమ్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. దీని బ్యాక్ సెటప్‌ డిజైన్‌ ప్రీమియం లుక్‌ని కలిగి ఉంటుంది. అలాగే ప్రీమియం కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకోండి.

ఈ Vivo V50 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన 6.82-అంగుళాల పంచ్-హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ డిస్ల్పే 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌తో వస్తోంది.. అలాగే స్మూత్‌ స్క్రోలింగ్ కోసం ప్రత్యేకమైన డిస్ల్పే సెటప్‌ను అందించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది 1080×3312 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తోంది. దీంతో పాటు స్పష్టమైన ప్రీమియం విజువలైజేషన్‌ కోసం కంపెనీ ఈ డిస్ప్లేలో ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఈ మొబైల్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఇది MediaTek డైమెన్సిటీ 8200 ప్రాసెసర్‌పై రన్‌ కాబోతున్నట్లు సమాచారం. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యుకమైన అప్లికేషన్స్‌ను తీసుకు రాబోతోంది.

వీవో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో అత్యంత శక్తివంతమైన బ్యాటరీతో విడుదల చేయబోతోంది. అతి తక్కువ ధరలోనే Vivo V50 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను 5600mAh బ్యాటరీ ఫ్యాకప్‌తో విడుదల చేయబోతోంది. అంతేకాకుండా ఈ బ్యాటరీ దాదాపు 2 నుంచి 3 రోజుల పాటు లైఫ్‌ను అందిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మొబైల్‌లో 220-వాట్ ఛార్జర్‌ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఈ చార్జన్‌ వినియోగించి చార్జ్‌ చేస్తే దాదాపు 40 నుంచి 50 నిమిషాల్లో ఫుల్‌ అవుతుంది. దీంతో పాటు అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ చూడానికి నెక్ట్‌ జనరేషన్‌ ఫోన్‌లా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫోటో వైరల్‌ అవుతోంది. ఇది లైట్‌ ఫిక్‌లో మొదటి సారిగా సోషల్‌ మీడియాలో కనిపించింది. ఇక కెమెరా విషయానికొస్తే, ఇందులోని బ్యాక్‌ కెమెరా 4K వీడియోను రికార్డ్ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు ప్రత్యేకమైన డెప్త్ సెన్సార్‌ను కూడా అందిస్తోంది. అలాగే ప్రీమియం లుక్‌ ఫోటోస్‌ అందిచేందుకు ప్రత్యేకమైన పోర్ట్రెయిట్ షాట్‌లను కూడా ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. ఇందులోని ఫ్రంట్‌ కెమెరా మాత్రం 64MP కలిగి ఉంటుంది. అలాగే ఇందులోని మొదటి వేరియంట్‌ 16GB ర్యామ్‌, 512GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో వస్తోంది. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News