Owaisi: హైడ్రాకు అక్బరుద్ధిన్ బస్తీమే సవాల్.. బుల్డోజర్లు వస్తే నేను వస్తా.. చూసుకుందాం..

Owaisi: హైడ్రాకు అక్బరుద్దీన్ సవాల్ విసిరారు. బుల్‌డోజర్లు వస్తే వాటికి అడ్డంగా నేను పడుకుంటాను  అంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఒకింత సీరియస్ అయ్యారు చిన్న ఒవైసీ. అంతేకాదు మా పార్టీ పేదల తమ పార్టీ తరుపున పోరాడుతాం అన్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 24, 2024, 01:06 PM IST
Owaisi: హైడ్రాకు అక్బరుద్ధిన్ బస్తీమే సవాల్.. బుల్డోజర్లు వస్తే నేను వస్తా..  చూసుకుందాం..

Owaisi: పేద, మధ్య తరగతి వారు జీవితాంతం కష్టపడి పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు కూల్చి, డబుల్‌ బెడ్‌ రూం ఇస్తే ఎలా ఒప్పుకుంటారన్నారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ. అధికారం వుందికాదని అభివృద్ధి పేరుతో పేదల ఇళ్ళు కూల్చడం సరికాదన్నారు. అందుకు తమ పార్టీ వ్యతిరేకమన్నారు అక్బరుద్దీన్ ఒవైసీ. హైదరాబాద్‌లోని పాతబస్తీ మూసీ పరివాహక ప్రాంతంలో ఆయన పర్యటించారు.  బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్న వారినీ ఉన్న పలంగా ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్లడం అంటే మాములు  విషయం కాదున్నారు. అంతేకాదు ఒక ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా ఉన్నవాళ్లు అక్కడ నుంచి సడెన్ గా ఖాళీ చేయడం అంటే ఎలా అన్నారు. అంతేకాదు హైడ్రా అక్రమ నిర్మాణాలు అంటూ కూల్చుకుంటూ పోతే నగరంలో ఏ ఇళ్లు ఉండదన్నారు.

అంతేకాదు నగరంలో తెలంగాణ ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహిస్తూన్న ‘సెక్రటెరీయట్’ తో పాటు అక్కడ ఉన్న మెంట్ మిగిలిన ప్రభుత్వ సంస్థలు అన్ని ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్నాయన్నారు. అటు ఐమాక్స్, జలవిహార్ సహా హుస్సెన్  సాగర్ ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్న విషయాన్ని పెద్ద ఓవైసీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే కదా.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

మొత్తంగా  దేశంలోని ప్రముఖు దేశ రాజకీయ నాయకులు సమాధులన్నీ  బఫర్ జోన్, FTL పరిధిలోనే ఉన్నాయన్నారు. చివరికి మహాత్మ గాంధీకి సంబంధించిన బాపూఘాట్‌ కూడా FTL పరిధిలోనే ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే కదా.  ఇవన్నీ కూల్చిన తర్వాత కానీ పేదల జోలికి రావొద్దన్నారు.  మొత్తంగా రేవంత్ రెడ్డి తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారులను, కొంత మంద బిజినెస్ మ్యాన్ లను దారిలో తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో హైడ్రాతో హైడ్రామాలు ఆడుతున్నారని ప్రతిపక్ష నేతలు ప్రస్తావిస్తున్నారు.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

 

Trending News