KTR: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అనుచరుడి హత్య.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

KT Rama Rao Supports To Congress MLC Jeevan Reddy: అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నాయకుడే హత్యకు గురవడంపై బీఆర్‌స్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విస్మయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ వ్యాఖ్యలకు ఆయన మద్దతు పలికారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 22, 2024, 06:23 PM IST
KTR: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అనుచరుడి హత్య.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

KT Rama Rao: రాజధాని హైదరాబాద్‌తోపాటు తెలంగాణవ్యాప్తంగా శాంతి భద్రతలు క్షీణించినట్టు కనిపిస్తోంది. దీనికి నిదర్శనమే కొన్ని నెలలుగా హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి. జర్నలిస్టులు, ప్రతిపక్ష నాయకులతోపాటు తాజాగా సొంత కాంగ్రెస్‌ పార్టీ నాయకులపైనే దాడులు జరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అనుచరుడు అత్యంత పాశవికంగా హత్యకు గురయ్యారు. ఈ సంఘటన తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు కారణం రేవంత్‌ రెడ్డి వైఫల్యమేనని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. పది నెలలుగా హోంమంత్రి లేకపోవడంతోనే శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు. ఈ సందర్భంగా జీవన్‌ రెడ్డి అనుచరుడి హత్యపై కేటీఆర్‌ స్పందించారు.

Also Read: Shocking Incident: హైదరాబాద్‌లో కలకలం.. రూ.50 కోసం అమ్మమ్మను చంపేసిన మనవడు

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి శాంతిభద్రతలపై చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ 'ఎక్స్‌' వేదికగా స్పందిస్తూ ఓ పోస్టు చేశారు. 'రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని కొన్ని నెలల నుంచి జనం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదే విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఆవేదనతో చెబుతున్నారు' అని కేటీఆర్‌ వివరించారు.

Also Read: Jagga Reddy: బ్రాయిలర్ కోడి కేటీఆర్.. నాటుకోడి రేవంత్ రెడ్డి: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

'తెలంగాణలో అదుపు తప్పిన శాంతి భద్రతలు పరిస్థితి చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవడం, పోలీసులు రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉండడంతోనే ఈ సమస్య తలెత్తింది' అని కేటీఆర్‌ వెల్లడించారు. 'ఇకనైనా శాంతి భద్రతలు కాపాడే విషయంలో ప్రభుత్వ పెద్దలు వివేకంతో ఆలోచించాలి. పోలీసు ఉన్నతాధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి' అని విజ్ఞప్తి చేశారు. 'రాష్ట్రంలో సమర్థవంతమైన పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. వారి పని వారిని చేసుకొనిస్తే శాంతి భద్రతలు, రాష్ట్రంలో సామరస్యాన్ని కాపాడగలుగుతారు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

క్షీణించిన శాంతిభద్రతలు
జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అనుచరుడి హత్య సంఘటన తీవ్ర కలకలం రేపింది. అధికార కాంగ్రెస్‌ పార్టీ నాయకుడే దారుణంగా హత్యకు గురవడంతో రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపుతోంది. 'రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా' అని కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధి నిలదీయడంతో రాష్ట్రంలో పరిస్ఙితులు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది. శాంతిభద్రతలు క్షీణించడంతో మహిళలు, ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులకు రక్షణ లేకుండాపోయింది. ఈ పది నెలల వ్యవధిలో ఎంతో మంది హత్యకు, దాడులకు గురయ్యారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

Trending News