New Liquor policy: మందుబాబులకు మరో శుభవార్త.. అప్పటి నుంచి వైన్ షాపుల్లో రూ. 99 లిక్కర్ బ్రాండ్లు..

Andhra Pradesh new liquor policy: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల కొత్త లిక్కర్ పాలసీలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిలో ఆబ్కారీ శాఖ మరో అదిరిపోయే శుభవార్త చెప్పినట్లు తెలుస్తోంది.

1 /6

ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడ చూసిన ప్రస్తుతం లిక్కర్ బ్రాండ్ల గురించి రచ్చ నడుస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలీసీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం హాయంలో నాణ్యమైన లిక్కర్ కు ప్రజలు దూరమైనట్లు కూడా కొంత మంది ప్రజలు గగ్గొలు పెట్టారు.

2 /6

అదే విధంగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో కూడా కూటమి అధకారంలోకి రాగానే.. ఏపీలో కొత్తగా  మద్యం పాలసీలను తీసుకొస్తామని కూడా చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. గతంలో ఇచ్చిన హమీల మేరకే ఇటీవల కొత్త మద్యం పాలసీతో కొత్త బ్రాండ్లను తీసుకొచ్చినట్లు తెలుస్తొంది.

3 /6

మరోవైపు ఏపీలో మాత్రం మద్యం లిక్కర్ పాలసీ మాత్రం రచ్చలేపిందని చెప్పవచ్చు.ఈ సారి లిక్కర్ షాపులను దక్కించుకునేందుకు ఒక రేంజ్ లో పోటీలు జరిగినట్లు తెలుస్తొంది. కొంత మంది వందల్లో కూడా లిక్కర్ షాపుల కోసం డబ్బులు సైతం కట్టారు.  

4 /6

మరికొందరు విదేశాల నుంచి కూడా లిక్కర్ షాపు తమకు దక్కుతుందో లేదో అని తమ లక్ ను టెస్ట్ చేసుకున్నారు. సర్కారు మాత్రం.. ఎక్కడా కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా.. డ్రాలో పేరు వచ్చిన వారికి లిక్కర్ షాపుల్ని కేటాయించారు.   

5 /6

ఇక వైఎస్సార్సీపీ మాత్రం తమ సర్కారులో ఉన్న బ్రాండ్ లను ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారని,  చంద్రబాబు ప్రభుత్వం లిక్కర్ పాలసీ పేరుతో ప్రజల్ని మోసం చేసిందని తీవ్రంగా విమర్శించారు. లిక్కర్ పాలసీ రూపంలో ప్రజల నుంచి కూటమి కోట్లాది రూపాయలు దోచుకుందని ఎద్దేవా చేశారు.

6 /6

ఈ క్రమంలో ప్రజలు మాత్రం.. రూ. 99 దొరికే క్వార్టర్ ఎప్పుడెప్పుడు దొరుకుంతుందా..అని ఎదురు చూస్తున్నట్లు తెలుస్తొంది.పలు చోట్ల, రూ. 99 కే క్వార్టర్ దొరకట్లేదని మందుబాబులు నిరసనలు సైతం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఆబ్కారీ శాఖ.. నాలుగు కంపెనీలలో 7 రకాల బ్రాండ్లు రూ. 99 కే అమ్మేందుకు అనుమతి పొందినట్లు తెలుస్తొంది. ఈ బ్రాండ్లు ఈ నెలాఖరు నాటికి 2.4 లక్షల కేసులు అందుబాటులోకి రానున్నాయని సమాచారం.