Renault Most Powerful Electric Motorcycle: రెనాల్ట్ (Renault) నుంచి మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్ లాంచ్ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మోటర్ సైకిల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Renault Most Powerful Electric Motorcycle: ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ రెనాల్ట్ (Renault) తమ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ తెలిపింది. పారిస్ మోటార్ షోలో ఈ కంపెనీ అద్భుతమైన బైక్‌ను పరిచయం చేసింది. ఇది హెరిటేజ్ స్పిరిట్ స్క్రాంబ్లర్ అనే పేరుతో అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే ఈ కంపెనీ రెనాల్ట్ 4 ఈ-టెక్ ఎలక్ట్రిక్ కారును కూడా విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. అయితే ఈ కారు విడుదలకు ముందే ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేయడం విశేషం..
ఈ హెరిటేజ్ స్పిరిట్ స్క్రాంబ్లర్ మోటర్ సైకిట్ ధరను కూడా రెనాల్ట్ ప్రకటించింది. దీనిని రూ.21.20 లక్షలకు విక్రయించబోతున్నట్లు తెలిపింది. అయితే ఈ బైక్ ధర కాస్త ఎక్కువైనప్పటికీ.. చాలా అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఈ మోటర్ సైకిల్‌ను ఎలాంటి రోబోటిక్స్‌తో తయారు చేయకుండా చేతులతో తయారు చేసినట్లు తెలుస్తోంది.
రెనాల్ట్ హెరిటేజ్ స్పిరిట్ స్క్రాంబ్లర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అతి శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ వేరియంట్‌లో రావడంతో అత్యధిక మైలేజీని అందిస్తుంది. ఇప్పటికే ఈ బైక్‌కి సంబంధించిన ప్రీ ఆర్డర్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది.
ఈ ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్ 50 వెర్షన్ పేరుతో అందుబాటులోకి రాబోతున్నట్లు రెనాల్ట్ వెల్లడించింది. మార్కెట్‌లో దీని ధర రూ. 21.20 లక్షలు కంటే ఎక్కువే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీని గరిష్ట వేగం దాదాపు సెకన్‌కి 45 కి.మీపైగా ఉంటుంది.
ఇక కారుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ కార్లు గరిష్టంగా 99 కిమీ/గం వేగాన్ని కలిగి ఉంటుంది. దీని ధర EUR 24,950 పైగానే ఉంటుంది. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ కారును నడపడానికి తప్పకుండా ప్రత్యేకమైన డ్రైవింగ్ లైసెన్స్ అవసరం ఉంటుందట.
ఇక ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వివరాల్లోకి వెళితే, ఇది అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ LED DRLలతో ఈ బైక్ రాబోతోంది. ఇవే కాకుండా LED హెడ్‌లైట్ యూనిట్‌తో పాటు మరెన్నో అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది.
మోటార్‌సైకిల్ ఎంతో శక్తివంతమైన 4.8 kWh బ్యాటరీ ప్యాక్ సెటప్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు 280 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో పాటు సింగిల్-పీస్ రిబ్డ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీనిని పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 110 కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది.