Lady Aghori Naga Sadhu: వెయ్యి శవాలు తిన్నా.. దుస్తులు లేకుండా ఉంటా.. కన్యతనం ఉన్నప్పుడే అలా చేయాలి!

Lady Aghori Naga Sadhu Viral Video: గత కొద్ది రోజుల నుంచి ఓ మహిళా అఘోరీ తెలంగాణలో కొన్ని దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేకమైన పూజలు చేస్తోంది. ఇటీవలే వేములవాడ రాజన్న స్వామి ఆలయంతో పాటు కొమురవెల్లి మల్లన్న గుడిలో పూజలు చేసింది. అంతేకాకుండా మొన్నటికి మొన్న కుమ్మరిగూడ ముత్యాలమ్మ టెంపుల్‌లో కూడి ప్రత్యేకమైన పూజలు చేశారు. అయితే ఇదే ఆలయంలో కొందరు దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.. 

1 /9

ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహం ధ్వసం చేసిన తరుణంలోనే మహిళా అఘోరి వెళ్లి ప్రత్యేకమైన పూజలు చేశారు. ఇదే సమయంలో అక్కడ ఆ అఘోరి మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలను చెప్పుకొచ్చారు.   

2 /9

నాగ సాధు నుంచి మహిళా అఘోరిగా మరడానికి కారణాలేంటో.. అసలు ఎలాంటి సమస్యల కారణంగా ఇలా మారారో? ముఖ్యంగా తెలుగు రాష్టాల్లోని ఆలయాల్లో మహిళా అఘోరి సందర్శించడానికి కారణాలేంటో? వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.  

3 /9

అక్కడే ఉన్న జీ తెలుగు న్యూస్‌కి సంబంధించిన జర్నలిస్ట్‌.. మహిళా అఘోరిని కొన్ని ప్రశ్నలు అడిగారు. సాధరణంగా పురుషులు మాత్రమే ఎక్కువగా అఘోరిగా మారుతారు. 

4 /9

అంతేకాకుండా వాళ్లను చూస్తే చాలా మంది స్త్రీలు కూడా భయపడుతూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఒక స్త్రీగా ఉండి ఎలా అఘోరిగా మారాల్సి వచ్చింది.? అని చాలా ప్రశ్నలు అడిగారు. ఆ అఘోరి ఇలా సమాధానం ఇచ్చారు. 

5 /9

ఆ మహిళా అఘోరి ఇలా అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.. అమె దాదాపు 7 సంవత్సరాల ఉన్నప్పుడే అఘోరీగా అవ్వాలనుకుందని.. ఇక కన్యతనం అప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోయి అఘోరిగా మారిందన్నారు.   

6 /9

అంతేకాకుండా ఈ సమయంలో కుటుంబంలో కూడా చాలా దూరంగా ఉండి.. దైవసంకల్పంతో చాలా మంది అఘోరాలను కలిసానని చెప్పారు. అఘోరాలు తనను తీసుకెళ్లారని.. అక్కడ మూడు నుంచి నాలుగు వేళ వరకు మహిళా అఘోరీలు ఉన్నారని చెప్పారు.   

7 /9

అలాగే కేవలం కుంభమేళా సమయంలో మాత్రమే మహిళా అఘోరీలు, పురుష అఘోరాలు భయటికి వస్తారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాల సందర్శన గురించి అడిగిన ప్రశ్నకు  మహిళా అఘోరీ ఇలా సమాధానం ఇచ్చారు. లోకకల్యాణం చేయాలనే తపనతోనే తనకు ఉన్న శక్తితో పదిమందికి సాయం చేడానికి ఆయాలు తిగిరి పూజలు చేస్తున్నట్లు తెలిపారు. 

8 /9

దుస్తువులు ఎందుకు వెసుకోరు అనే ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చారు.. తల్లి గర్భం నుంచి వచ్చే క్రమంలో ప్రతి ఒక్కరూ ఎలాంటి దుస్తువులు లేకుండా వస్తారని.. చనిపోయిన తర్వాత కూడా దుస్తులు తీస్తారని, ఆ మహిళా అఘోరీ కూడా ఎలాంటి దుస్తులు లేకుండా బయటికి వెళ్తారని తెలిపారు.

9 /9

అంతేకాకుండా అప్పుడప్పుడు ఆకలి వేసినప్పుడు మహిళా అఘోరీలు శవాలు కూడా తింటారని తెలిపారు. ఇప్పటికే వారు వెయ్యి శవాలకు పైగా తిన్నారన్నారు.