Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలతో మరోసారి నాగార్జున సాగర్ కు వరద పోటెత్తింది. ఒక్కో గేటును అడుగుల మేర ఎత్తిని నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. 64,800 క్యూసెక్కుల వరద నీటిని ప్రాజెక్టు అధికారులు దిగువకు పంపిస్తున్నారు.
నాగార్జున సాగర్ జలాశయానికి 1,08,912 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులకు చేరింది.
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఈ నేపథ్యంలోనే దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. ఈ సీజన్ లో కురిసిన భారీ వర్షాలకు ముందుగా నాగార్జున సాగర్ ఎగువ ప్రాజెక్టులైనా జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి.
ఆ తర్వాత వచ్చిన శ్రీశైలం గేట్లు ఎత్తడంతో నాగార్జున సాగర్ మెల్లగా నిండింది. అంతేకాదు పూర్తి స్థాయి నీటి మట్టం నిండటంతో ఆ దిగువ ఉన్న పులి చింతలకు నీటిని విడుదల చేసారు. మొత్తంగా దాదాపు 7 యేళ్ల తర్వాత నాగార్జున సాగర్ డ్యామ్ నిండింది. తాజాగా ఇపుడు ఏపీ సహా ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు సాగర్ కు వరద పోటెత్తుతుంది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter