Fact Check: నిరుద్యోగులకు మోదీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. నెలకు రూ. 3500 నిరుద్యోగ భృతి..?

unemployment benefit: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిరుద్యోగులకు నెలకు రూ. 3500 నిరుద్యోగ భృతి అందిస్తోందా..సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వెనుక ఉన్న నిజా నిజాలేంటి..? కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఇలాంటి పథకం తెచ్చిందా లేదా..తెలుసుకుందాం..  

Written by - Bhoomi | Last Updated : Oct 19, 2024, 10:05 AM IST
 Fact Check: నిరుద్యోగులకు మోదీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. నెలకు రూ. 3500 నిరుద్యోగ భృతి..?

Fact Check: కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం నిరుద్యోగులను ఉద్దేశించి ప్రతినెల 3500 రూపాయల నిరుద్యోగ భృతిని అందిస్తోందా.. ఈ నిరుద్యోగ భృతి పొందాలంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలా.. ఇలాంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక వాట్సాప్ మెసేజ్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

మోదీ ప్రభుత్వం ప్రతినెల 3500 రూపాయల పెన్షన్ అందిస్తోందని. ఈ స్కీం ద్వారా అప్లై చేసుకున్న యువతి యువకులకు ప్రతినెల 3500 అకౌంట్ లో పడతాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది పూర్తిగా అవాస్తవం అని కేంద్ర ప్రభుత్వ ప్రచార మంత్రిత్వ శాఖ పిఐబి తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపింది. 

కేంద్ర ప్రభుత్వం ఇలాంటి స్కీములు ప్రవేశపెట్టలేదని, ఈ సందర్భంగా తెలిపింది. సోషల్ మీడియాలో చలామణి అవుతున్న ఈ మెసేజ్ పూర్తి అవాస్తవం అని.. ఇలాంటి లింకులను ఎట్టి పరిస్థితులలోను క్లిక్ చేయకూడదని కూడా హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకం ప్రవేశపెట్టినా వెంటనే దానికి సంబంధించిన సమాచారం అన్ని పత్రికల్లోనూ, అన్ని ప్రసారమాధ్యమాలలోనూ ప్రచారం చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే ఈ పథకాలను క్యాబినెట్ నిర్ణయం ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫేక్ సమాచారం పట్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా పిఐబి పేర్కొంది. ముఖ్యంగా ఎవరైతే తప్పుడు సమాచారం ద్వారా ప్రజల నుంచి డేటా రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు వారి పట్ల చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించింది. 

Also Read: Ram Lakshman:  బండరాళ్ల మధ్య ఇరుక్కున్న బాలింతను  కాపాడిన రామ్- లక్ష్మణ్ మాస్టర్లు.. వీడియో వైరల్  

గతంలో ఇలాంటి ఫేక్ మెసేజ్ ల ద్వారా ప్రజల నుంచి డేటా చోరీ జరిగిందని, ఈ సందర్భంగా పిఐబీ పేర్కొంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన పథకాలను అమల్లో ఉన్న పథకాలను ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ఈ పథకాలను అమలు చేస్తుందని ఈ సందర్భంగా పేర్కొంది. 

భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి తప్పుడు సమాచారం పేర్కొన్నట్లయితే సర్కులేట్ చేసినట్లయితే వారిపట్ల చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపింది. పౌరులు ఎవరైనా ఇలాంటి ఫేక్ సమాచారాన్ని గుర్తించినట్లయితే వెంటనే తమకు తెలియజేయాలని, లేదా పోలీసు విభాగంలోని సైబర్ క్రైమ్ దృష్టికి తీసుకొని వెళ్లాలని ఈ సందర్భంగా పేర్కొంది. 

ఇలాంటి ఫేక్ సమాచారం ద్వారా ఎవరైనా డేటా చోరీకి పాల్పడినట్లైతే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ పేర్కొంది.

 

Also Read: Gold Rate Today: ఆల్ టైం రికార్డులు బద్దలు కొట్టిన బంగారం..తొలిసారి 80000 దాటిన తులం పసిడి ధర

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News