Vitamin B3 Rich Foods: విటమిన్ బి3 లోపముందా, వెంటనే ఈ 5 పదార్ధాలు డైట్‌లో చేర్చండి

మనిషి శరీరంలో అవసరమైన వివిధ రకాల పోషకాల్లో ముఖ్యమైంది నయాసిన్ లేదా విటమిన్ బి3. శరీర నిర్మాణం, ఎదుగుదలకు ఇది చాలా అవసరం. దీనినే నయాసినా్ లేదా నయసినమైడ్ అంటారు. నికోటినిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. విటమిన్ బి3 లోపముంటే డెర్మటైటిస్, డిమెన్షియా, డయేరియా వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అందుకే ఏయే ఆహార పదార్ధాలు తీసుకోవాలో తెలుసుకుందాం.

Vitamin B3 Rich Foods: మనిషి శరీరంలో అవసరమైన వివిధ రకాల పోషకాల్లో ముఖ్యమైంది నయాసిన్ లేదా విటమిన్ బి3. శరీర నిర్మాణం, ఎదుగుదలకు ఇది చాలా అవసరం. దీనినే నయాసినా్ లేదా నయసినమైడ్ అంటారు. నికోటినిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. విటమిన్ బి3 లోపముంటే డెర్మటైటిస్, డిమెన్షియా, డయేరియా వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అందుకే ఏయే ఆహార పదార్ధాలు తీసుకోవాలో తెలుసుకుందాం.

1 /5

ట్యూనా ఫిష్ ఇందులో నియాసిన్ సమృద్ధిగా ఉంటుంది. 165 గ్రాముల ట్యూనా ఫిష్ తీసుకుంటే అందులో 21.9 గ్రాముల విటమిన్ బి3 లభిస్తుంది. ఇది రోజువారీ అవసరంలో 100 శాతం కంటే ఎక్కువ. దీంతోపాటు ఇందులో ప్రోటీన్లు, విటమిన్ బి6, విటమిన్ బి12, సెలేనియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి

2 /5

వేరుశెనగ వేరుశెనగ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కూడా నియాసిన్ సమృద్ధిగా ఉంటుంది. దీంతోపాటు ఇందులో ప్రోటీన్లు, మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్స్ , విటమిన్ ఇ, విటమిన్ బి6, మెగ్నీషియం, ఫాస్పరస్, మాంగనీస్ అధికంగా ఉంటాయి.

3 /5

చికెన్ బ్రెస్ట్ చికెన్ బ్రెస్ట్ పీస్‌లో నియాసిన్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. 85 గ్రాముల చికెన్ బ్రెస్ట్ పీస్‌లో 11.4 మిల్లీగ్రాముల నియాసిన్ ఉంటుంది. ఇది రోజువారీ అవసరంలో 70-80 శాతం కావచ్చు. 

4 /5

బ్రౌన్ రైస్ వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచిది. ఒక కప్పు బ్రౌన్ రైస్‌లో రోజువారీ అవసరంలో 21 శాతం నియాసిన్ లభిస్తుంది. డయాబెటిస్ రోగులకు సైతం బ్రౌన్ రైస్ చాలా మంచిది

5 /5

అవకాడో అవకాడోలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.  మీడియం సైజ్ అవకాడోలో  3.5 మిల్లీగ్రాముల నియాసిన్ ఉంటుంది. ఇది రోజువారీ అవసరంలో 25 శాతం వరకూ ఉండవచ్చు. దాంతోపాటు ఇందులో ఉండే ఫైబర్, హెల్తీ ఫ్యాట్, విటమిన్లు, మినరల్స్ ఆరోగ్యానికి చాలా మంచిది.