Shani dev: శని చెడు ప్రభావంతో బాధపడుతున్నారా..?.. ఈ ఒక్క పరిహారం పాటిస్తే మీ లైఫ్‌లో అన్ని అద్భుతాలే..

Shani Dev Remedies:  చాలా మంది ఏలినాటి,అర్దష్టమ, సాడేసాతి ప్రభావంతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు కొన్ని పరిహారాలు పాటిస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు.

1 /6

శనిదేవుడు ఎంతో కరుణ గలదేవుడని చాలా మందికి తెలీయదు. ఆయన మనం చేసుకున్న కర్మలను బట్టి మాత్రంమే ఫలితాలు ఇస్తుంటాడు. సూర్యుడి కుమారుడు, యమధర్మరాజు సోదరుడు శనిదేవుడు.

2 /6

ఆయన చేసుకున్న కర్మలను బట్టి ఫలితాలు ఇస్తుంటాడు. అందుకే మంచి పనులు చేయాలని కూడా పండితులు చెబుతుంటారు. మెయిన్ గా.. శనిదేవుడు సాడేసాతి, అర్ధష్టమ, ఏలినాటి ప్రభావాలు కల్గజేస్తుంటాడు.

3 /6

ఈ సమయంలో మనిషి చాలా ఇబ్బందులకు గురౌతుంటాడు. అయితే.. శనిదేవుడికి కొన్ని పరిహారాలు పాటిస్తే మాత్రం అనుకొని విధంగా ధనలాభాలు కల్గుతాయని పండితులు చెబుతుంటారు.

4 /6

శనివారం రోజున శనిదేవుడికి నూనెతోఅభిషేకం చేయాలి. అంతేకాకుండా. . నల్లని బట్టలను దానంగా ఇవ్వాలి. నవధాన్యాలను దానంగా ఇవ్వాలి. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయాలి.

5 /6

శనిదేవుడికి వెంకటేశ్వర స్వామి, హనుమంతుడు అంటే ఎంతో ఇష్టం. అందుకే హనుమంతుడికి తమలపాకులతో పూజించాలి.వెంకటేశ్వర వ్రతంను ఆచరించిన కూడా మంచి ఫలితాలు కల్గుతాయి.

6 /6

అదే విధంగా శనివారం రోజున ఇనుప వస్తువులు ఇంటికి తేకూడదు. కొత్తబట్టలు, ఉప్పు, నూనెలు ఇంటికి తెచ్చుకోకూడదు. చెప్పులు కొనకూడదు. ఆరోజున శనికి ఇష్టమైన కాకికి, కుక్కలకు ఆహారంగా రొట్టేలు, ఆహారం తినడానికి పెట్టాలి. ఇలా చేస్తే శనిదోషాలన్నిపోతాయి.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)