Secbad to Goa Train: భాగ్యనగర వాసులకు కేంద్రం శుభవార్త.. సికింద్రాబాద్ టూ గోవా కొత్త ట్రైన్ షురూ.. టికెట్ రేట్స్ ఎంతంటే..

Hyderabad Goa Train: భాగ్య నగర వాసులకు నవరాత్రుల సందర్భంగా కేంద్రం శుభవార్త చెప్పింది. ఈ సోమవారం నుంచి సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త ట్రైన్ ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

1 /7

కేంద్ర ప్రభుత్వం నవరాత్రుల కానుకగా.. సికింద్రాబాద్ నుంచి గోవాకు వెళ్తున్న  బై-వీక్లీ రైలును ప్రారంభించింది.  ఈ రైలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరీ ముఖ్యంగా పర్యాటకులకు అనుకూలంగా ఈ రైలు ప్రారంభించబోతున్నట్టు తెలిపింది. ఇప్పటివరకు సికింద్రాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు.. డైరెక్ట్ ట్రెయిన్ ఉండేది కాదు.

2 /7

వారానికి ఒక ట్రైన్ మాత్రం 10 కోచ్ లతో సికింద్రాబాద్ నుండి బయలుదేరి గుంతకల్ కు చేరుకొని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్ళే మరో 10 కోచ్ లతో కలిసి గోవాకు వెళ్లేది.

3 /7

సికింద్రాబాద్ - వాస్కోడిగామా మధ్య కొత్త ట్రైన్ సోమవారం ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ నుంచి గోవాకు ఈ కొత్త ట్రైన్ 20 గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది.

4 /7

ఉదయం 11: 45 లకు బయలు దేరి నెక్ట్స్ డే ఉదయం 7:20 లకు గోవాకు చేరుకుంటుంది.సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ప్రత్యేక రైలు మొత్తం 20 స్టేషన్లలో ఆగుతూ గోవాకు వెళ్తుంది. ఈ బై వీక్లీ ట్రైన్ బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. వాస్కోడగామా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణం అవుతుంది.

5 /7

ఇది సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ.. వాస్కోడగామా చేరుకుంటుంది. దాదాపు 20 గంటలపాటు సాగే ఈ రైలు ప్రయాణం.. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ పాటుగా కర్ణాటక ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

6 /7

ఈ కొత్త రైలు ఈ మూడు రాష్ట్రాల పర్యాటక రంగానికి, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతానికి కూడా సికింద్రాబాద్-గోవా ప్రత్యేక రైలు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

7 /7

సికింద్రాబాద్-గోవా రైలు టికెట్ రేట్స్ విషయానికొస్తే.. స్లీపర్.. రూ. 440.. త్రీ టైర్ ఏసీ - రూ. 1185. టూ టైర్ ఏసీ - 1700గా ఉన్నాయి.దీంతో పాటు కాచిగూడ - యలహంక మధ్య వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్లే 4 కోచ్ లను కలిపేవారు. ఈ 4 కోచ్ లను గుంతకల్ జంక్షన్ వద్ద షాలిమార్ - గోవా మధ్య నడిచే రైలుకు అనుసంధానం చేసి ప్రయాణం సాగించేవారు.