Salary Hike News: ఉద్యోగులకు బొనంజా.. భారీగా జీతాలు పెంపు.. ఎప్పుడంటే..?

Employees Salary Hike Updates: ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. వచ్చే ఏడాది మన దేశంలో భారీగా జీతాలు పెంపు ఉండనుంది. 9.5 శాతం వరకు జీతం పెరుగుదలను ఉంటుందని ఓ సర్వేలో వెల్లడైంది. 2024లో 9.3 శాతం ఉండగా.. 2025లో మరింత ఎక్కువ పెరగనుంది. గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ ఏవోన్ నిర్వహించిన 30వ వార్షిక వేతన పెంపు టర్నోవర్ సర్వే జీతాల పెంపు గురించి కీలక విషయాలను వెల్లడించింది. 
 

1 /7

జూలై, ఆగస్టు నెలల్లో 40 ఇండస్ట్రీలకు చెందిన 1,176 కంపెనీల డేటాను విశ్లేషించి ఈ సర్వే రిపోర్ట్‌ను తయారు చేశారు.   

2 /7

ఇంజినీరింగ్‌, తయారీ, రిటైల్‌ పరిశ్రమల్లో వేతనాలు 10 శాతం, ఆర్థిక సంస్థల్లో జీతాలు 9.9 శాతం పెరుగుతాయని సర్వేలో తేలింది.  

3 /7

ఈ సర్వే నివేదిక ప్రకారం.. వచ్చే ఏడాది ప్రైవేట్ ఉద్యోగుల జీతం యావరేజ్‌గా 9.5 శాతం పెరుగుతుందని అంచనా వేస్తనన్నారు. 2025లో తయారీ, రిటైల్‌లో 10 శాతం, ఫైనాన్షియల్ కంపెనీలలో 9.9 శాతం పెరుగుదల ఉండవచ్చు.   

4 /7

గ్లోబల్ కాంపిటెన్స్ సెంటర్, టెక్నాలజీ ప్రొడక్ట్‌లు 9.9 శాతం, ప్లాట్‌ఫారమ్‌ల ఉద్యోగులు 9.3 శాతం వరకు శాలరీ హైక్ పొందవచ్చని చెబుతున్నారు.   

5 /7

ఇక టెక్నాలజీ కౌన్సెలింగ్, సేవా రంగంలో జీతంలో 8.1 శాతం వరకు పెరుగుదల ఉంటుందని అంటున్నారు.   

6 /7

అదేవిధంగా వచ్చే ఏడాది అట్రిషన్ రేటు తగ్గుతుంది. ఈ రేటు 2022లో 21.4 శాతం ఉండగా.. 2023లో 18.7 శాతానికి తగ్గింది.   

7 /7

ప్రస్తుత సంవత్సరంలో 16.9 శాతంగా అంచనా వేస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతంగా ఉండగా.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇది 7.2 శాతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.