Ear Bites In Bus Of Hyderabad: తెలుగు సినీ పరిశ్రమలో మరో వివాదం చోటుచేసుకుంది. ర్యాగింగ్ భూతంలో ఓ సినీ ప్రముఖుడు తనయుడు బాధితుడు అయ్యాడు. సీనియర్ విద్యార్థి చెవి కొరకడంతో తీవ్ర గాయాలపాలైన సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. తన తనయుడిని సీనియర్లు వేధించడంతో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పోలీసులను ఆశ్రయించాడు. తన కుమారుడికి గాయమైందని.. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి ఇంట్లో భారీ దొంగతనం.. బెంగాల్‌లో దొంగలు అరెస్ట్
హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఫిర్యాదు చేశారు. తన కొడుకు వైష్ణవ్‌ను అతడి సీనియర్ విద్యార్థులు వేధించారని.. ర్యాగింగ్ పేరుతో గాయపర్చారని వాపోయారు. ఓ సీనియర్ విద్యార్థి తన కుమారుడు చెవి కొరికినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఆర్‌పీ తనయుడు వైష్ణవ్ ఎంబీఏ చదువుతున్నాడు. అయితే కళాశాలలో తన కుమారుడిని సీనియర్లు వేధిస్తున్నారని వాపోయారు. అదే కళాశాలలో సీనియర్ విద్యార్థి శ్యామ్ బస్సులో వైష్ణవతో గొడవకు దిగారని చెప్పారు. ఘర్షణ సమయంలో ఆవేశంతో శ్యామ్ తన కుమారుడి చెవిని కొరికాడాని ఆరోపించారు. ఈ సందర్భంగా శ్యామ్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: ED Raids: తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్‌షాక్.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు..
అతడు చదువుకుంటున్న కళాశాలలో ర్యాగింగ్ గురువారం జరిగినట్లు సమాచారం. తనకు జరిగిన అవమానం విషయం తన తండ్రి ఆర్‌పీ పట్నాయక్‌కు వివరించాడు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. నిన్న రాత్రి రాయదుర్గం పోలీస్ స్టేషన్‌ను ఆర్బి పట్నాయక్ ఫిర్యాదు చేశారు. జరిగిన ఉదంతాన్ని ఫిర్యాదు పత్రంలో వివరించారు. వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఓ చిన్న విషయంలో పట్నాయక్ కుమారుడు వైష్ణవ్‌తో అతడి సీనియర్ విద్యార్థులు దుర్భాషలాడడం హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం ర్యాంగిగ్ అని తెలియడంతో చర్చనీయాశమైంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గతంలో స్టార్ సంగీత దర్శకుడిగా రాణించిన ఆర్‌పీ పట్నాయక్ కొన్ని సంవత్సరాలు పరిశ్రమకు దూరమయ్యారు. ఆ క్రమంలో నటుడిగా కూడా కెరీర్ ప్రారంభించారు. చాలా రోజుల తర్వాత దగ్గుబాటి సురేశ్ తనయుడు అభిరామ్ నటించిన అహింస సినిమాకు ఆర్‌పీ పట్నాయక్ సంగీతం అందించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.