Rakul Preet Singh: గ్లామర్ తోనే చెమటలు పట్టిస్తున్న రకుల్.. ఫోటోలు వైరల్..!

Rakul Preet Singh Hot Photos: తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన భర్త జాకీ భగ్నానీ తో కలిసి ఎంజాయ్ చేసిన సందర్భాలను  ఫోటోలు,  వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పంచుకుంది .ఈ ఫోటోలు , వీడియోలు చూసి నెటిజన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు జిమ్ లో వర్కౌట్  లు చేస్తూ చెమట చిందిస్తూ గ్లామర్ లుక్కుతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. 
 

1 /5

ఫిట్నెస్ ఫ్రీక్ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగులో పలు చిత్రాలలో నటించి భారీ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈమె ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా పంచుకుంటుంది.

2 /5

ఎప్పుడు ఫిట్ గా ఉండాలని భావించే రకుల్ ప్రతిక్షణం జిమ్ లో గడుపుతూ వర్కౌట్స్ చేస్తూ చెమటలు చిందిస్తూ కష్టపడి పోతూ ఉంటుంది. అంతేకాదు జిమ్ లో చెమటలు పట్టిస్తూనే జిమ్ సూట్ లో వయ్యారాలు పోతూ హాట్ గ్లామర్ తో అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా కాస్త సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో వాలిపోయే ఈమె తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే భర్తతో కలిసి ఈ వీక్ ఎంజాయ్ చేసినట్టు అందుకు సంబంధించిన ఫోటోలను,  వీడియోలను కూడా షేర్ చేసింది రకుల్.   

3 /5

మొదటి ఫోటోలో జిమ్లో వర్కౌట్లు చేస్తూ తెగ కష్టపడి పోతూ.. నడుము అందాలతో మరొకసారి గిలిగింతలు పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక మరొక వీడియో విషయానికి వస్తే.. నదిలో జలకాలాడుతూ స్విమ్ సూట్ లో అందరిని మరింత ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా గ్లామర్ వలకబోయడంలో ఈమె తర్వాతే ఎవరైనా అన్నట్టుగా సందడి చేసింది. 

4 /5

అలాగే సముద్రంలో తన భర్తతో రైడ్ కు వెళ్లి మరొకసారి అందర్నీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తన భర్తతో ఇలా వీకెండ్స్ ఎంజాయ్ చేయడం చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చింది. తన భర్త జాకీ భగ్నానీ తో కలిసి ఫుల్ ఎంజాయ్ చేసినట్టు,  అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరింత ఆకట్టుకుంది.   

5 /5

ఇకపోతే రకుల్ సినిమాల విషయానికి వస్తే..టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించి ఆకట్టుకున్న ఈమె తెలుగు, తమిళ్, కన్నడ అంటూ అన్ని భాషల్లో కూడా నటించి ఇప్పుడు బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయింది. ఇక ఇలా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఇక్కడ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటుంది.  

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x