Redmi 12 5G Price Cut: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో త్వరలోనే ప్రైమ్ డేస్ సేల్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ సేల్స్‌లో భాగంగా అన్ని రకాల ఎక్ట్రిక్ వస్తువులు అతి తక్కువ ధరల్లోనే లభించనున్నాయి. అంతేకాకుండా వీటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్ బోనస్‌ను కూడా అందించబోతోంది. అయితే ఈ ప్రైమ్ డేస్ సేల్స్‌ను అమెజాన్ జూలై 20వ తేది నుంచి ప్రారంభించబోతోంది. ఈ సేల్ ప్రారంభం కాకముందే Redmi 12 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభించడమే కాకుండా అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్ట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై లభిస్తున్న ఆఫర్స్ ఏంటో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం Redmi 12 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇందులోని మిడిల్ రేంజ్ (6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్) వేరియంట్ స్మార్ట్‌ఫోన్ MRP ధర రూ.17,999 నుంచి ప్రారంభం కాబోతోంది. అయితే ప్రత్యేకమైన డీల్‌లో కొనుగోలు చేసేవారికి దాదాపు 31 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ.12,499కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఇతర ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, ఈ Redmi 12 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే క్రమంలో ప్రత్యేమైన కూపన్‌ను వినియోగిస్తే రూ.1000 వరకు ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై ఉన్న ఎక్చేంజ్ ఆఫర్‌ను వినియోగించి రూ.11,850 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ అనేది ఎక్చేంజ్ చేసే మొబైల్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. కండీషన్ బాగుంటే ఈ బోనస్ లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్ పోను రూ.649కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
రెడ్‌మీ 12 టాప్ ఫీచర్స్:
6.79-అంగుళాల FHD+ డోట్ డిస్ప్లే
90Hz అడాప్టివ్ సింక్ రిఫ్రెష్ రేట్
HDR10 సపోర్ట్
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్
6nm ప్రాసెస్ టెక్నాలజీ
ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
50MP ప్రైమరీ సెన్సార్
8MP అల్ట్రావైడ్ సెన్సార్
2MP మాక్రో సెన్సార్
13MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
5000mAh బ్యాటరీ
33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
6GB LPDDR4X ర్యామ్
128GB UFS 2.2 స్టోరేజ్
Android 13 ఆపరేటింగ్ సిస్టమ్
5G కనెక్టివిటీ
డ్యూయల్-బ్యాండ్ Wi-Fi
బ్లూటూత్ 5.2
USB Type-C
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Redmi 12 5G Price: 5000mAh బ్యాటరీ, 50MP కెమెరా Redmi 12 5G మొబైల్ కేవలం రూ.649కే.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి!