Drumstick Tomato Curry Recipe: మధుమేహం ఉన్నవారు తప్పక ట్రై చేయాల్సిన హెల్తీ కర్రీ.. తయారీ విధానం సులభమే..

Drumstick Tomato Curry: మధుమేహం ఉన్నవారు వారంలో ఒకసారైనా మునగకాయతో తయారుచేసిన కర్రీని ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే ఆరోగ్య గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలు పెంచకుండా కాపాడుతాయి. అంతేకాకుండా మునగకాయ టమాటో కర్రీని తినడం వల్ల కూడా మీరు ఈ లాభాలు పొందవచ్చు.
 

Drumstick Tomato Curry: వారంలో ఒకరోజైనా ఆహారంలో భాగంగా మునగకాయను చేర్చుకోవడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి ముఖ్యంగా గుండె జబ్బులు మధుమేహంతో బాధపడుతున్న వారు ప్రతి రెండు రోజులకైనా ఒకసారి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. ముఖ్యంగా తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వారంలో ఒకసారైనా తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మునగకాయను వివిధ రకాల పద్ధతిలో కూరగా తయారు చేసుకుంటారు చాలామంది వీటిని ఎక్కువగా సాంబార్లో వినియోగిస్తే మరికొంతమంది అయితే కేవలం మునగకాయలతోనే స్పెషల్ గా సాంబార్ చేసుకుంటారు. అయితే డయాబెటిస్తో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా అయినా మునగకాయతో చేసిన టమాటో కర్రీని మిల్లెట్స్ రోటితో తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. మీరు కూడా టమాటో మునగకాయ కర్రీ ని ఇంట్లోనే ట్రై చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇలా సులభమైన పద్ధతిలో ఇప్పుడే తయారు చేసుకోండి. 

1 /18

2 /18

మునగకాయలు - 250 గ్రాములు (తొక్క తీసి, ముక్కలుగా కోసుకోవాలి), టమాటో - 2 (ముక్కలుగా కోసుకోవాలి), ఉల్లిపాయ - 1 (తరిగినది), వెల్లుల్లి - 5 రెబ్బలు (తరిగినవి)  

3 /18

అల్లం - 1 అంగుళం ముక్క (తరిగినది), ఆకుకూరలు - 1/2 కప్పు (కొత్తిమీర, పుదీనా), నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు - 1/2 టీస్పూన్, జీలకర్ర - 1/2 టీస్పూన్  

4 /18

పసుపు - 1/2 టీస్పూన్, కారం - 1 టీస్పూన్, ధనియాల పొడి - 1 టీస్పూన్, గరం మసాలా - 1/2 టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా  

5 /18

తయారీ విధానం: ముందుగా ఈ కర్రీని తయారు చేసుకోవడానికి పెద్ద బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో పైనుంచి తొక్క తీసుకున్న మునగకాయలను కట్ చేసుకుని వేసుకోవాలి.   

6 /18

ఇలా బౌల్లో వేసుకున్న మునగ కాయలను బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.  

7 /18

ఆ తర్వాత ఒక బాణలిలో నూనె వేడి చేసి, ఆవాలు వేసి వేయించాలి.  

8 /18

ఆవాలు బాగా వేగిన తర్వాత 30 సెకండ్లు అలాగే ఉంచి జీలకర్ర, ఉల్లిపాయ వేసి బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి.  

9 /18

ఆ తర్వాత అవి వేగిన వెంటనే వెల్లుల్లి, అల్లం వేసి వాసన వచ్చే వరకు వేయించాలి.  

10 /18

ఆ తర్వాత ముక్కలుగా కోసి పెట్టుకున్న టమాటోలు వేసి, మెత్తబడే వరకు ఉడికించాలి.  

11 /18

టమాటోలు బాగా మెత్తబడిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి.  

12 /18

ఆ తర్వాత మునగకాయ ముక్కలు వేసి, 5 నిమిషాలు ఉడికించాలి.  

13 /18

మునగ కాయలు బాగా ఉడికిన తర్వాత అందులోనే కావలసినంత ఉప్పు వేసుకొని మరో 5 నిమిషాలు ఉడికించాలి.  

14 /18

ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు తప్పకుండా పుదీనాతో గార్నిష్ చేసుకొని ఆ తర్వాత కొత్తిమీర పైనుంచి వేసి సర్వ్ చేసుకోవచ్చు.   

15 /18

చిట్కాలు: మునగకాయలను వేయించే ముందు 10 నిమిషాలు నీటిలో నానబెట్టడం వల్ల అవి మృదువుగా ఉంటాయి.  

16 /18

మీరు మరింత రుచి కోసం, 1/2 టీస్పూన్ శొంఠి పొడి కూడా వేయవచ్చు. ఈ పొడి వేసుకోవడం వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.  

17 /18

టమాటోలకు బదులుగా కావాలనుకుంటే మీరు 1/2 కప్పు టమాటా ప్యూరీ కూడా వాడవచ్చు.  

18 /18

ఈ వంటను మరింత హెల్తీగా తయారు చేసుకోవడానికి ఇందులో కందిపప్పు లేదా పెసరపప్పును కూడా వినియోగించవచ్చు.  

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x