Aadhar Card Types: ఆధార్ కార్డు ఎన్ని రకాలుంటుంది. మీరెలాంటి కార్డు వినియోగిస్తున్నారో తెలుసా

Aadhar Card Types: ప్రతి పనికీ ఆధార్ అవసరం. ప్రభుత్వ, ప్రైవేట్ పనులు ఏదైనా సరే ఆధార్ ఆధారంగా మారింది. యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసే ఆధార్ కార్డు నాలుగు రకాలుగా ఉంటుందని మీకు తెలుసా..ఆ వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 19, 2024, 09:48 AM IST
Aadhar Card Types: ఆధార్ కార్డు ఎన్ని రకాలుంటుంది. మీరెలాంటి కార్డు వినియోగిస్తున్నారో తెలుసా

Aadhar Card Types: ఆధార్ కార్డు నాలుగు రకాలుగా ఉంటుందని చాలామందికి తెలియదు. ఆధార్ కార్డు ఓ వ్యక్తి గుర్తింపుకు నిర్ధిష్టమైన ప్రమాణ పత్రం. ఆధార్ కార్డు లేకుండా ఆఖరికి సిమ్ కార్డు కూడా తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఓ వ్యక్తి సమస్త సమాచారం ఆ కార్డులో నిక్షిప్తమై ఉంటుంది. 

ఆధార్ కార్డులో ఆ వ్యక్తికి సంబంధించిన పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఫోటో, మెయిల్ ఐడీ, బయోమెట్రిక్ వివరాలు పూర్తిగా ఉంటాయి. ఆధార్ కార్డు జారీ చేసే యూఐడీఏఐ నాలుగు రకాల కార్డులు జారీ చేస్తుంటుంది. ఈ నాలుగు కార్డుల విభిన్నమైన ఫీచర్లు, ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఇందులో మొదటిది ఆధార్ లెటర్. ఇదొక లామినేటెడ్ పేపర్. ఇందులో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ తరహా కార్డు కోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది మీ ఇంటికి నేరుగా వస్తుంది. మీ ఆధార్ కార్డు పోయినా, డ్యామేజ్ అయినా కొత్తది తీసుకోవచ్చు. యూఐడీఏఐ వెబ్‌సైట్ నుంచి కొత్త ఆధార్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

ఇక రెండవది ఇ ఆధార్. ఇది పాస్‌వర్డ్ ప్రొటెక్టెడ్ కార్డు. ఇందులో ఉండే క్యూఆర్ కోడ్‌తో ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ కోసం పనిచేస్తుంది. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేయవచ్చు. ఫిజికల్ ఆధార్ కార్డు ఎలా పనిచేస్తుందో అదే విధంగా పనిచేస్తుంది. 

పీవీసీ ఆధార్ కార్డు ముడో రకం. ఇది కాంపాక్ట్ తరహాలో ఏటీఎం కార్డు పరిమాణంలో ఉంటుంది. మీ వ్యాలెట్‌లో సులభంగా పడుతుంది. ఇందులో కూడా క్యూఆర్ కోడ్, ఫోటో, డెమోగ్రఫిక్ వివరాలన్నీ ఉంటాయి. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

ఇక నాలుగోది ఎంఆధార్. యూఐడీఏఐ జారీ చేసే ఈ కార్డు ఆన్‌లైన్ వెరిఫికేషన్‌కు పనిచేస్తుంది. ఇదొక సాఫ్ట్ కాపీ తరహా కార్డు. ఇందులో కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది. 

Also read: Motorola Edge 50 Ultra: మూడు 50MP, ఒక 64MP కెమేరాతో శక్తివంతమైన మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News