Xiaomi 14 Civi: కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? Xiaomi 14 Civi వచ్చేస్తోంది..ధర, స్పెసిఫికేషన్స్ ఇవే..

Xiaomi 14 Civic Price In India: అతి తక్కువ ధరలోని ఎక్కువ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలని మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. జూన్ 20వ తేదీన మార్కెట్లోకి Xiaomi 14 Civi ఫోన్ అందుబాటులోకి రాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 13, 2024, 06:13 PM IST
Xiaomi 14 Civi: కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా?  Xiaomi 14 Civi వచ్చేస్తోంది..ధర, స్పెసిఫికేషన్స్ ఇవే..

 

Xiaomi 14 Civic Price In India: భారత మార్కెట్లో ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ షియోమి కి మంచి గుర్తింపు ఉంది. అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి మొబైల్స్‌ని విక్రయించడం వల్ల చాలామంది యువత ఈ మొబైల్స్‌ని కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉన్నారు. అప్పుడప్పుడు షియోమి కంపెనీ హై బడ్జెట్ కలిగిన స్మార్ట్ ఫోన్స్‌ని కూడా విక్రయిస్తూ వస్తోంది. గతంలో అనేక రకాల ప్రీమియం ఫీచర్లతో ఈ కంపెనీ మంచి బడ్జెట్లో స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన సంగతి  అందరికీ తెలిసింది. అయితే త్వరలోనే ఈ మొబైల్ కంపెనీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన కొన్ని వివరాలను కొంతమంది టిప్ స్టర్స్ వెల్లడించారు. త్వరలోనే ఈ షియోమి కంపెనీ నుంచి మార్కెట్లోకి లాంచ్ కాబోయే మొబైల్ ఏంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

షియోమి కంపెనీ తమ కొత్త స్మార్ట్ ఫోన్ Xiaomi 14 Civi పేరుతో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండడమే కాకుండా కొత్త లుక్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది మొదటి క్వాడ్ కర్మ్డ్ బాడీతో మెటల్ ఫ్రేమ్‌తో అందుబాటులోకి రానుంది. దీనిని కంపెనీ రూ. 50 వేల లోపే ప్రవేశపెట్టే అవకాశాలున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మొబైల్ గతంలో లాంచ్ అయిన Xiaomi 14, Xiaomi 14 Ultra స్మార్ట్ ఫోన్స్ కంటే అద్భుతమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉంటాయి. 

ఫీచర్స్, స్పెసిఫికేషన్స్:
ఇక ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, కంపెనీ ఈ మొబైల్ ను 6.55- AMOLED 1.5K డిస్ప్లే తో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ డిస్ప్లే ప్యానల్ 3,000 nits గరిష్టమైన బ్రైట్నెస్ ను అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్ ప్యానెల్, 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో అందుబాటులోకి రానుంది. అలాగే డిస్ప్లే సెక్యూరిటీ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ను కూడా అందిస్తోంది. అలాగే కంపెనీ దీనిలో 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను అందిస్తోంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఈ స్మార్ట్ ఫోన్ Qualcomm సంబంధించిన స్నాప్ డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. దీంతోపాటు ఇది 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మొబైల్ Android 14పై రన్ కానుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళితే, ఇది 4,700 mAh బ్యాటరీ సపోర్టుతో రాబోతోంది. ఇక ఈ మొబైల్ బ్యాక్ సెట్ అప్‌లో OIS 50 MP Summilux లెన్స్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. దీంతోపాటు అదనంగా 50 MP Leica పోర్ట్రెయిట్ షూటర్‌ను కూడా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ జూన్ 20వ తేదీన మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ మొబైల్ కు సంబంధించిన ధర వివరాల్లోకి వెళ్తే, దీనిని కంపెనీ రూ.42,999 నుంచి ప్రారంభించబోతోంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News