Kakarakaya Biryani Recipe In Telugu: బిర్యానీ అంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలైతే ప్రతి వారం తప్పకుండా బిర్యానీ అడుగుతూ ఉంటారు. అయితే చాలా మంది మాంసంతో తయారు చేసిన బిర్యానీలు తింటూ ఉంటారు. వీటికి బదులుగా కూరగాయలతో చేసిన బిర్యానీలు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కాకర కాయతో తయారు చేసిన బిర్యానీని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా శరీరాన్ని రక్షిస్తుంది. అయితే సులభంగా ఇంట్లోనే కాకర బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
2 కాకరకాయలు (తరిగినవి)
2 కప్పుల బాస్మతి బియ్యం
1/2 కప్పు ఉల్లిపాయ (తరిగినవి)
1/4 కప్పు టమాటాలు (తరిగినవి)
1/4 కప్పు కొత్తిమీర (తరిగినవి)
1/4 కప్పు పుదీనా (తరిగినవి)
1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
1 టేబుల్ స్పూన్ గరం మసాలా
1/2 టీస్పూన్ పసుపు
1/2 టీస్పూన్ మిరపకాయల పొడి
1/4 టీస్పూన్ జీలకర్ర పొడి
1/4 టీస్పూన్ ధనియాల పొడి
ఉప్పు రుచికి సరిపడా
నూనె వేయడానికి
తయారీ విధానం:
ఈ బిర్యానీని తయారు చేసుకోవడానికి ఓ బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో బియ్యాన్ని 30 నిమిషాలు నానబెట్టుకోండి.
ఒక పెద్ద బాణలిలో నూనె వేడి చేసి, ఉల్లిపాయ వేసి బంగారు గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించాలి.
ఆ తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, గరం మసాలా, పసుపు, మిరపకాయల పొడి వేయాల్సి ఉంటుంది.
అవి బాగా వేగిన తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కొన్ని నిమిషాలు ఉడికించాలి.
ఇందులోనే తరిగిన కాకరకాయలు, ఉప్పు వేసి బాగా కలపాలి.
ఆ తర్వాత 2 కప్పుల నీరు పోసి, మూత పెట్టి 20 నిమిషాలు ఉడికించాలి.
నానబెట్టిన బియ్యాన్ని నీటిని పారబోసి, కాకరకాయ మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాలు లేదా బియ్యం ఉడికే వరకు దమ్తో ఉడికించాల్సి ఉంటుంది.
కొత్తిమీర, పుదీనాతో అలంకరించి, వేడిగా వడ్డించుకుంటే చాలు..
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
చిట్కాలు:
ఈ కాకరకాయ బిర్యానీ మరింత రుచి ఉండాలంటే, కాకరకాయలను వేయించే ముందు మసాలాలలో కొద్దిసేపు నానబెట్టవచ్చు.
ఉడికించే బియ్యంలో కొబ్బరి పాలు లేదా పెరుగు వేస్తే బిర్యానీ మరింత బాగుంటుంది.
కాకరకాయలతో పాటు ఇతర కూరగాయలు, బంగాళాదుంపలు లేదా క్యారెట్లు కూడా వేయవచ్చు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి