/telugu/photo-gallery/how-to-make-easy-and-delicious-bakery-style-plum-cake-here-pr-ocess-of-making-rv-187168 Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా 187168

Benefits Of Sweet Potato: కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఈ కూరగాయల్లో చిలకడదుంప ఒకటి. ఇది ఎంతో రుచికరమైన, పోషకమైన కూరగాయ. ఇది భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందినది. ఇందులో విటమిన్‌, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలు ఉంటాయి. చిలకడదుంప ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. చిలకడదుంప తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

చిలకడదుంపలో అధిక శాతం విటమిన్‌ సి ఉంటుంది. ఇది రోగనిరోగధక శక్తిని పెంచడంలో ఎంతో సహాయపడుతుంది. ఇది సీజన్‌ లో కలిగే జలుబు, ఫ్లూ, అంటువ్యాధుల నుంచి ఎంతో రక్షిస్తుంది. అలాగే ఈ దుంపను తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో ఎంతో సహాయపడుతుంది. 

ఈ చిలకడదుంపలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ వల్ల కలిగే నష్టాని తొలగించడంలో ఎంతో సహాయపడుతుంది. అలాగే క్యాన్సర్‌ కణాలను తొలగించడంలో కీలక ప్రాత పోషిస్తుంది. మలబద్ధకం, గ్యాస్‌, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ చిలకడదుంపను తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఫైబర్‌ జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుతుంది. ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది.  

అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఈ చిలకడదుంపను తీసుకోవడం వల్ల బరవు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫైబర ఆకలి నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుంది. అతిగా తినడాన్ని నివారించడంలో ఎంతో సహాయపడుతుంది. చిలకడదుంపలో విటమిన్‌ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో మేలు చేస్తాయి. అలాగే వృద్థాప్య సంకేతాలను నివారించడంలో ఎంతో సహాయపడుతాయి.  ఈ చిలకడదుంపలను తీసుకోవడం వల్ల కళ్ళు మెరుగుపడుతాయి. ఇందులో ఉండే విటమిన్‌ ఎ కంటి సమస్యలు కలగకుండా సహాయపడుతుంది. రాత్రిపూట దృష్టిని మెరుగుపరచడంలో , మచ్చల క్షీణత వంటి వయస్సు సంబంధిత వ్యాధుల నుంచి తగ్గిస్తుంది. చిలకడదుంపలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచదు. ఇది డయాబెటిస్ ఉన్నవారికి మంచి ఎంపిక.

 చిలకడదుంపను ఇలా తీసుకోండి:

చిలకడదుంపను వివిధ రకాలుగా ఆస్వాదించవచ్చు. దీన్ని ఉడికించి, వేయించి, కాల్చవచ్చు లేదా సూప్‌లు, స్టూలు, సలాడ్‌లకు జోడించవచ్చు. చిప్స్, ఫ్రైస్ గా తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్యలాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
There Are Many Health Benefits In Sweet Potato Sd
News Source: 
Home Title: 

Sweet Potato: తీయటి చిలకడదుంప.. లాభాలు తెలుస్తే అసలు వదలిపెట్టారు..!

Sweet Potato: తీయటి చిలకడదుంప.. లాభాలు తెలుస్తే అసలు వదలిపెట్టారు..!
Caption: 
Zee Telugu News
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
తీయటి చిలకడదుంప.. లాభాలు తెలుస్తే అసలు వదలిపెట్టారు..!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Saturday, May 18, 2024 - 10:21
Created By: 
Shashi Maheshwarapu
Updated By: 
Shashi Maheshwarapu
Published By: 
Shashi Maheshwarapu
Request Count: 
20
Is Breaking News: 
No
Word Count: 
303