Sun Transit In Taurus In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు సంచారం చేయడాన్ని సంక్రాంతిగా కూడా పిలుస్తారు. ఈ గ్రహం ఏ రాశిలోకి వెళ్తుందో సంక్రాంతికి ముందు ఆ రాశి పేరు వస్తుంది. సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేస్తే మకర సంక్రాంతిగా పిలుస్తారు. ఇలా ఈ గ్రహం ఏ రాశిలోకి సంచారం చేస్తే సంక్రాంతి ముందు ఆ రాశి పేరు వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ సూర్యగ్రహం మే 14వ తేదిన వృషభ రాశిలోకి సంచారం చేస్తుంది. అయితే ఈ రాశి సంచారం చేసిన 1 నెల పాటు ఉంటుంది. నెల దాటిన తర్వాత ఈ సూర్యగ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంది. అయితే ఈ సూర్య గ్రహ సంచారం కారణంగా మే 14వ తేది నుంచి కొన్ని రాశులవారి జీవితాల్లో పూర్తిగా మార్పులు వస్తాయి.
మేషరాశి:
సూర్యుడు సంచారం కారణంగా మేష రాశివారి జీవితంలో ఒక్కసారిగా మార్పులు వస్తాయి. విద్యార్థులకు చదువుపై విపరీతమైన ఆసక్తి పెరుగుతుంది. దీంతో పాటు వీరు ఎంతో ఓపికతో ఉండడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వ్యాపారాల్లో కొన్ని సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా సంపదలో కూడా మార్పులు కూడా వస్తాయి. దీంతో పాటు వీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
వృషభ రాశి:
వృషభ రాశివారికి సూర్యుడి సంచారంతో కొన్ని చిన్న సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో పాటు కొంతమందిలో మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మతపరమైన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. దీంతో పాటు కుటుంబంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా వాహన సౌఖ్యం పెరుగుతుంది.
మిథున రాశి:
మిథున రాశి రాశివారికి సూర్యగ్రహం సంచారంతో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు వీరిలో తెలియని భయం కూడా పెరుగుతుంది. కాబట్టి వీరు స్వీయ నియంత్రణలో ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా వీరికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. దీంతో పాటు ఆదాయ వనరులు కూడా పెరుగుతుంది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కూడా ఈ సమయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో పాటు వీరు స్వీయ నియంత్రణలో ఉండడం చాలా మంచిదని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరికి కుటుంబ సభ్యుల మద్ధతు కూడా లభించి, అనేక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
సింహ రాశి:
ఈ సంచారంతో సింహ రాశివారికి అనేక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. దీంతో పాటు మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. అలాగే వీరికి శాంతి, ఆనందం కూడా పెరుగుతుంది. అలాగే వీరిపై వీరికి పూర్తి విశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా పనుల్లో మార్పులు వస్తాయి. శ్రమ కూడా రెట్టింపు అవుతుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
కన్య రాశి:
కన్య రాశివారికి సూర్యుడి సంచారంతో అనేక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా మానసిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే వీరికి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అలాగే ఉద్యోగాల్లో పురోగతి కూడా లభిస్తుంది.
తులారాశి:
తులారాశివారికి కూడా ఈ సమయంలో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ఆత్మవిశ్వాసం లోపించడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఖర్చులు కూడా రెట్టింపు అవుతాయి. మతపరమైన విషయాల పట్ల ఆశక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇబ్బందులు కూడా పెరుగుతాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి