Two Climaxes for Thandel : యువహీరో నాగ చైతన్య, సాయి పల్లవి మొదటిసారి కలిసి నటించిన లవ్ స్టొరీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. క్యాస్ట్ డిఫరెన్స్, మొలెస్టేషన్ వంటి చాలా సెన్సిటివ్ టాపిక్స్ తో కథ రెడీ చేసిన శేఖర్ కమ్ముల సినిమాతో మంచిహిట్ తన ఖాతాలో వేసుకున్నారు.
నిజానికి ఈ సినిమా కోసం.. చిత్ర డైరెక్టర్ శేఖర్ కమ్ముల రెండు క్లైమాక్స్ అనుకున్నారు. ఒక క్లైమాక్స్ ను ఆల్రెడీ సినిమాలో చూసేశాము కానీ రెండవ క్లైమాక్స్ ఏంటో మాత్రం ప్రేక్షకులకు తెలియలేదు. ఇప్పుడు నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటిస్తున్న రెండవ సినిమా తండేల్ విషయంలో కూడా అదే జరగబోతుంది.
వివరాల్లోకి వెళితే, చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా తండేల్. చందు మొండేటి ఈ సినిమా కోసం థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవిల ప్రేమ కథను ఎలా ముగించాలి అనే దానిమీద చందు మొండేటి రెండు వేరే వేరే క్లైమాక్స్ వర్షన్ లు రాసుకున్నారట.
క్లైమాక్స్ ఎలా ఉంటే ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారు.. అనే దానిమీద చందు మొండేటి బాగా విశ్లేషించి నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. హీరోయిన్ బుజ్జి తల్లి క్యారెక్టర్ కి సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉంటుందట. అందుకే చిత్ర బృందం పట్టుబట్టి సాయి పల్లవి ని హీరోయిన్ గా ఎంపిక చేశారు. మరి ఈ సినిమాకి లవ్ స్టోరీ సినిమా లాగా హ్యాపీ ఎండింగ్ ఇస్తారా లేక ట్రాజిడీ లాగా ఏమన్నా చూపిస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
బన్నీ వాస్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్ తో సాగుతుంది. ఈ సినిమాలో నాగచైతన్య ఇంతకుముందు ఎప్పుడూ కనిపించనటువంటి ఒక మాస్ పాత్రలో.. పడవ నడుపుతూ చేపలు పట్టేవాడిగా కనిపించబోతున్నాడు. ఒక మామూలు చేపలు పట్టేవాడు అయ్యుండి ప్రాణాలకు తెగించి పాకిస్తాన్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే కాన్సెప్ట్ మీద ఈ సినిమా కథ నడుస్తుంది.
మంచి అంచనాల మధ్య ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 20 న థియేటర్ల లో విడుదల కాబోతోంది. విడుదలకి ఇంకా చాలా సమయం ఉండడంతో.. చిత్ర బృందం ప్రస్తుతం సినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
Also Read: Chiranjeevi: పవన్‌ను చూస్తే గుండె తరుక్కుపోతుంది.. ఓటేసి గెలిపించండి చిరంజీవి పిలుపు
Also Read: Singanamala: ప్రచారంలో ఎండదెబ్బ.. మంచానికి పరిమితమైన శింగనమల టీడీపీ అభ్యర్థి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter