Tips To Know Diffrence Bet ween real and fake Almonds: ప్రస్తుతం మార్కెట్ లో ప్రతీదీ నకిలీదివే దొరుతున్నాయి. పప్పులు, బియ్యం, చింతపండు, విలాయిచీ,నూనెలు ఇలా ప్రతిదీ మార్కెట్లలో నకిలీవి బ్లాక్ లో విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే దీనిపై అధికారులు ఎంత జాగ్రత్తలు తీసుకున్న కూడా నకిలీ పదార్థాలను పూర్తిగా మార్కెట్ లో లేకుండా మాత్రం చూడటం లేదు. ఇదిలా ఉండగా.. కొందరు అధికారులు నకిలీ పదార్థాలు తయారు చేసే వారితో కుమ్మక్కైపోతుంటారు. ఇలాంటి వారి వల్ల.. సాధరణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. మార్కెట్ లలో ఇటీవల నకిలీ బియ్యంసైతం విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు అధికారులు ఘటనలు వెలుగులోకిరాగానే చర్యలు తీసుకుంటారు. ఆతర్వాత విక్రయాలు యథావిధిగా జరుగుతుంటాయి.
ముఖ్యంగా కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అందరు డ్రైఫ్రూట్స్ లను ఎక్కువగా తింటున్నారు.బాదంలను నీళ్లలో నానబెట్టుకుని ఉదయాన్నే తింటారు. దీంతో బాదంకు ప్రస్తుతం డిమాండ్ పెరిగింది. దీంతో మార్కెట్ల లోకి బాదంలు నకిలీకి వస్తున్నాయి.
బాదంలను నకిలీకి రావడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఓరిజినల్ ఎలానో.. నకిలీవి ఎలానో తెలుసుకొవడానికి ఇబ్బందులు పడుతున్నారు. బాదంలను కొనడానికి వెళ్లినప్పుడు కొన్ని టిప్స్ పాటించాలి. దీంతో బాదంల ఓరిజినాలిటీ ఇట్టే చేప్పేయోచ్చు. బాదంను కొనుగోలు చేసినప్పుడు దాన్ని టిష్యూపేపర్ తో రుద్దాలి. అదిరంగు కోల్పోతే కల్లీదని లేకుంటే.. అది స్వచ్చమైనదిగా గుర్తించవచ్చు. బాదంలను చేతిలో తీసుకుని నలిపేయాలి. అది నకిలీది అయితే మన చేతికిఎలాంటి నూనె లాంటి పదార్థం అంటుకోదు. కేవలం పొడిగా ఉంటే మాత్రం అది కల్తీదని అర్థం.నిజమైన బాదం పప్పు నీళ్లలో నానబెడితే ఎంతో ఉబ్బుతుంది.
కానీ నకీలి బాదం నీళ్లలో ఉబ్బదు. అదే విధంగా బాదంను టెస్టు చేయడం ద్వారా కూడా బాదం ఓరిజినల్ అవునా కాదా ఇట్టే చేప్పేయోచ్చు. ఈ టిప్స్ పాటిస్తే బాదంలు నిజమైనదా లేదా నకీలీదా అనేది ఇట్టే చెప్పేయోచ్చు. బాదంలను కొనుగులు చేసినప్పుడు అది ముక్కలుగా విరిగిపోయి ఉంటే అస్సలు కొనకూడదు. కొన్నిసార్లు బాదంల నుంచి ఒకరకమైన స్మెల్ వస్తుంది. ఇలాంటి సమయంలో బాదంలను కొనడం మాత్రం మానుకోవాలి. మరోచోటకి వెళ్లి స్వఛ్చమైన బాదంలను కొనుగొలు చేయాలి. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter