Revanth Reddy Plane: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ముగింపు కార్యక్రమం ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణకు చెందిన పార్టీ బృందం విమానంలో వెళ్తుండగా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆ బృందంలో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి దీపా మున్షీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉప ముక్యమంత్రి భట్టి విక్రమార్క తదితర కీలక నాయకులు ఉన్నారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దాదాపు గంటన్నరపాటు విమానాశ్రయంలో వేచి ఉండాల్సిన పరిస్థితి.
Also Read: KCR House: మాజీ సీఎం కేసీఆర్ ఇంటికి తాగునీటి ఇబ్బందులు.. నీరు రాకుండా రేవంత్ రెడ్డి కుట్రనా?
హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముంబై వెళ్లే ఇండిగో విమానం (6E5099) గంటన్నర పాటు ఆలస్యమైంది. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ముంబై బయల్దేరాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం ఇంజన్‌లో అధిక వేడిక వలన ఏసీ సమస్య తలెత్తింది. అనంతరం విమానం ఇంజన్ ప్రారంభం కాలేదు.
ఈ విమానంలో రేవంత్‌రెడ్డి, దీపా మున్షీ, భట్టి, పొన్నం తదితరులు ఉన్నారు. సాంకేతిక సమస్యలను పునరుద్ధరణ అనంతరం ఆ విమానం ముంబై బయల్దేరినట్లు సమాచారం. గంటన్నరపాటు విమానంలోనే వారు పడిగాపులు కాశారు. అయితే రేవంత్ ప్రయాణించే విమానంలో సాంకేతిక సమస్య వాటిల్లడం కాంగ్రెస్ శ్రేణులను కలవర పరిచింది. సమస్య పరిష్కారమై వారు క్షేమంగా ముంబై చేరుకున్నారనే వార్తతో ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Kavitha Arrest: కవిత అరెస్ట్ వెనకాల ఉన్న కథ ఇదే.. ఢిల్లీ కుంభకోణం అంటే ఏమిటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter