Kerala Govt: దేశంలోనే తొలి ఓటీటీ ప్రారంభించిన కేరళ సర్కార్.. రూ. 75కే సినిమాలు..

CSpace: ఇప్పటి వరకు ప్రైవేట్ సంస్థలు మాత్రమే ఓటీటీ సర్వీసులను అందిస్తూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు దేశంలో తొలిసారిగా కేరళ ప్రభుత్వం ఓటీటీ సర్వీసులను ప్రారంభించింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2024, 03:23 PM IST
Kerala Govt: దేశంలోనే తొలి ఓటీటీ ప్రారంభించిన కేరళ సర్కార్.. రూ. 75కే సినిమాలు..

Kerala Launches India's First Govt Ott Platform: దేశంలోనే మెుట్టమెుదటిసారిగా ప్ర‌భుత్వ ఆధ్వర్యంలో నడిచే తొలి ఓటీటీ ప్లాట్‌ఫాం సీస్పేస్ (CSpace)ను కేర‌ళ సీఎం పిన‌రయి విజ‌య‌న్ గురువారం ప్రారంభించారు. తిరువనంతపురంలోని కైరలీ థియేటర్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి విజయన్ దీనిని లాంచ్ చేశారు. ఈ వేడుకను ఆ రాష్ట్ర సాంస్క్రతిక శాఖ మంత్రి సాజి చెరియన్ అధ్యక్షత వహించారు. దేశంలో తొలి ప్రభుత్వ రంగ ఓటీటీ వేదిక ఇదేనని ఆయన అన్నారు. 

ఈ సీస్పేస్ ను కేరళ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ తరపున కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (KSFDC) డెవలప్ చేసింది.  సీస్పేస్..  కంటెంట్ ఎంపిక మరియు ప్రచారానికి సంబంధించి ఓటీటీ రంగంలో ఎదుర‌య్యే స‌వాళ్ల‌ను పరిష్కరించడమే లక్ష్యంగా దీనిని తీసుకొచ్చారు. ఇది మలయాళ సినిమా ఎదుగుదలకు కీలక మైలురాయి అని సీఎం అన్నారు.  సాంస్కృతిక రంగంలో ప్ర‌ముఖులైన బెన్య‌మిన్‌, ఓవీ ఉష‌, సంతోష్ శివ‌న్‌, శ్యామ‌ప్ర‌సాద్‌, స‌న్నీ జోసెఫ్‌, జియో బేబీ వంటి 60 మంది క్యూరేట‌ర్ల ప్యానెల్ మార్గ‌నిర్ధేశ‌క‌త్వంలో సీస్పేస్ కార్య‌క‌లాపాలు కొన‌సాగుతాయి.

పే ఫ‌ర్ వ్యూ అనే విధానంపై నడిచే సీ స్పేస్ సినిమాకు రూ. 75 వసూలు చేస్తుంది. సీ స్పేస్ లో ప్రసారం చేయాలంటే 40 నిమిషాల షార్ట్ ఫిల్మ్ కి రూ. 40, 30 నిమిషాలకు రూ.30 వసూలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా జాతీయ, రాష్ట్ర అవార్డులు గెలుచుకున్న, అలాగే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై చిత్రాలను ఇందులో ప్రదర్శించనున్నారు. ఈ యాప్ ను గూగుల్ ప్లేస్టోర్, ఐఓఎస్ నుంచి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

Also read: Saagu: అనేక ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో రానున్న సాగు.. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం అంటోన్న నిహారిక

Also Read: Gaami Twitter Review: గామి ట్విట్టర్ రివ్యూ.. విజువల్ వండర్.. ఫిక్స్ అయిపోండి.. పక్కా హిట్..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News