Milk And Pumpkin Seeds: పాలు , గుమ్మడి గింజలు కలిపి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

Milk And Pumpkin Seeds Benefits: ఆరోగ్యంగా ఉండానికి చాలామంది వివిధ ఆహార పదార్థాలు తీసుకుంటారు. అయితే పాలతో గుమ్మడి గింజలు కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 16, 2024, 05:00 PM IST
Milk And Pumpkin Seeds: పాలు , గుమ్మడి గింజలు కలిపి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

Milk And Pumpkin Seeds Benefits: గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడాల్సిన అవసరం ఉండదు.  అయితే ప్రతిరోజు పాలలో మనం చాలా రకాల పదార్థాలను కలుపుకొని తింటాము. అయితే ఈ గుమ్మడి గింజలను కలిపి తినడం వల్ల కలిగే లాభాలు తెలుస్తే షాక్‌ అవుతారు. దీని వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. 

గుమ్మడి గింజల్లో  262 మిల్లీగ్రాముల వరకు మెగ్నీషియం ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్‌, ప్రోటీన్‌, మంచి కేలరీలు కూడా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కీళ్ల నొప్పులతో బాధపడే వారు ఈ పాలు , గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడుతారు. 

గుమ్మడి గింజల్లో  విటమిన్ ఇ, కెరోటినాయిడ్ల , యాంటీ ఆక్సిడెంట్ల ఉంటాయి. దీని తీసుకోవడం వల్ల ఫ్రీ రాడికల్స్‌ ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడానికి ఎంతో ఉపయెగపడుతాయి. గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడాల్సి అవసరం ఉందదు. దీని లభించే మినర్స్‌ మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని నేరుగా కూడా తీసుకోవచ్చు. 

పాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలులో ఎముకలను దృఢంగా తయారు చేసే శక్తి ఉంటుంది. దీని తీసుకోవడం వల్ల మెగ్నీషియం లభిస్తుంది. దీని వల్ల ఎముకలు, కీళ్ల దృఢంగా, బలంగా తయారు అవుతాయి. 

ప్రతిరోజు మీరు పాలు, గుమ్మడి గింజలు కలిపి తీసుకోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. దీని తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. ఇది ఎముక పగుళ్లు, ఎముకల వ్యాధి నుంచి కాపాడుతుంది. ప్రతిరోజు గుమ్మడి కాయ గింజలు తీసుకోవడం ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.  చిన్న పిల్లలు వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఎదుగుతారు. అలాగే ఆహారం కూడా సమయానికి తీసుకుంటారు. పెద్ద వాళ్ళు ఈ ఆహారం ఉదయం పూట తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. మీరు కూడా తప్పకుండా ఈ పదార్థాలను తీసుకోవడం చాలా అవసరం . 

Also Read: Summer Foods: వేసవికాలంలో ఈ పదార్థాలు తప్పకుండా తీసుకోవాలి.. లేదంటే అంతే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News