Praneetha Subhash: బొంగరం కళ్ళతో మరోసారి ఆకట్టుకున్న ప్రణీత.. అమ్మో బాపు గారి బొమ్మో..

Praneetha Subhash Pics: 

పెద్ద పెద్ద కళ్ళతో.. మనందరినీ మాయ చేసిన హీరోయిన్ ప్రణీత సుభాష్. సినిమాలకు దూరమై కొద్ది రోజులు కావస్తున్న ఇంకా తన ఇంస్టాగ్రామ్ ఫోటోలతో మాయ చేస్తోంది..

  • Jan 20, 2024, 13:11 PM IST
1 /7

Praneetha Subhash Pics: బొంగరం లాంటి కళ్ళు తిప్పింది.. ఉంగరాలున్న జుట్టు తిప్పింది… బాపు గారి బొమ్మో.. అంటూ మనల్ని మాయ చేసిన హీరోయిన్ ప్రణీత సుభాష్.

2 /7

2010లో పూరి జగన్నాథ్ తెలుగులో తీసిన పోకిరి సినిమా కన్నడ రీమేక్ పోర్కి అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది ఈ పెద్ద కళ్ళ సుందరి.

3 /7

ఆ తరువాత ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది. అయితే ఈ హీరోయిన్ కి తెలుగులో గుర్తింపు తెచ్చి పెట్టిన చిత్రం మాత్రం సిద్ధార్థ తో నటించిన బావ.  

4 /7

బావ సినిమా పెద్దగా హిట్ అవ్వకపోయినా ప్రణీతకు మాత్రం తెలుగులో క్రేజ్ సంపాదించి పెట్టింది. ఆపై 2011లో ఉదయన్ సినిమాతో తమిళంలో తెరంగేట్రం చేసి దాదాపు సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో నటించింది.  

5 /7

2013లో విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేదితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకునింది. ఆ తర్వాత ఈ హీరోయిన్ మంచు మనోజ్ తో నటించిన పాండవులు పాండవులు తుమ్మెద కూడా పరవాలేదు అనిపించుకుంది.

6 /7

ఇక ఈ మధ్య పెళ్లి చేసుకుని.. పిల్లల్ని కని సినిమాలకి కొంచెం దూరమైన ప్రణీత ..ఇంస్టాగ్రామ్ లో మాత్రం తన ఫోటోలతో మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా బ్లాక్ సూట్ లో అందమైన ఫోటోలు షేర్ చేసి ప్రేక్షకులను అలరించింది.  

7 /7

ఈ ఫోటోలలో ప్రణీత అత్తారింటికి దారేది చిత్రం టైం లో ఎంత అందంగా ఉందో ఇప్పటికీ అంతే అందంగా కనిపిస్తూ.. అభిమానుల దగ్గర నుంచి ప్రశంసలు తెచ్చుకుంటోంది.