Vitamin B12 Surplus Side Effects: శరీరానికి అవసరమైన న్యూట్రియంట్లలో అత్యంత కీలకమైంది విటమిన్ బి12. శరీరం పనితీరుకు విటమిన్ బి12 చాలా అవసరం. అయితే విటమిన్ బి12 కొంతమందికి ప్రతికూల ప్రభావం కల్గించవచ్చు. విటమిన్ బి12 సప్లిమెంట్స్ తీసుకునే ముందు ఎవరెవరికి దుష్పరిణామాలు కలుగజేస్తుందో తెలుసుకోవడం ముఖ్యం.
విటమిన్ బి12 అనేది నిస్సందేహంగా శరీరానికి అత్యంత ఆవశ్యకమైన న్యూట్రియంట్. కానీ కొంతమందికి ఇది సైడ్ ఎఫెక్ట్స్ కలగజేస్తుంది. విటమిన్ బి12 సప్లిమెంట్ కల్గించే దుష్పరిణామాలను పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా డయేరియా, స్కిన్ రియాక్షన్స్, డిజినెస్, ఎలర్జిక్ రెస్పాన్స్, ఓవర్ డోస్ రిస్క్ ఉంటాయి.
విటమిన్ బి12 కల్గించే ప్రతికూల ప్రభావాల్లో ముఖ్యమైంది డయేరియా. పరిమితి దాటినా డయేరియాకు దారి తీస్తుంది. అలాగని అందరికీ ఇది వర్తించకపోవచ్చు. జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు వైద్యుని సలహా మేరకే విటమిన్ బి12 సప్లిమెంట్స్ తీసుకోవల్సి ఉంటుంది.
ఏదైనా సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన సూచనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎంత డోసు తీసుకోవాలనేది తెలుసుకోవాలి. విటమిన్ బి 12 పరిమితి దాటి తీసుకుంటే కచ్చితంగా దుష్పరిణామాలు ఎదురుకావచ్చు. ఈ పరిస్థితి నివారించాలంటే వైద్యుని సలహా మేరకు నిర్ణీత మోతాదులోనే విటమిన్ బి12 తీసుకోవాలి.
విటమిన్ బి12 దుష్పరిణామాల్లో మరో ముఖ్యమైంది చర్మ సంబంధిత రియాక్షన్స్. కొంతమందిలో దురద, ర్యాషెస్ రావచ్చు. చర్మ సంబంధిత సమస్యలు కొంతమందికి ఇబ్బందిగా మారవచ్చు. ఈ సమస్య ఎదురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
డిజినెస్ అనేది మరో ప్రధాన సమస్య. విటమిన్ బి12 పరిమితి దాటి తీసుకుంటే అంటే మోతాదుకు మించి తీసుకుంటే డిజినెస్ సమస్య ఏర్పడవచ్చు. అందుకే ఈ సమస్యతో బాధపడేవారు వైద్యుని సలహా మేరకు విటమిన్ బి12 తీసుకోవల్సి ఉంటుంది.
కొన్ని అరుదైన కేసుల్లో ఎలర్జిక్ రియాక్షన్ సమస్య వస్తుంది. విటమిన్ బి12 మోతాదు దాటితే ఎలర్జిక్ సమస్యలు ఎదురుకావచ్చు. దీనివల్ల దురద, స్వెల్లింగ్, బ్రీతింగ్ సమస్యలు ఉత్పన్నం కావచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook