grapes juice benefits: ద్రాక్ష పండ్లు వివిధ రకాల్లో లభిస్తాయి. గింజలు ఉండే ద్రాక్ష పండ్లు, గింజలు లేని ద్రాక్ష పండ్లు, హైబ్రిడ్ ద్రాక్ష పండ్లు ఇలా వివిధ రుచుల్లో అందుబాటులో ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ద్రాక్ష పండులో మినరల్స్, విటమిన్స్‌తో పాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా థయామిన్, విటమిన్ సి,ఇ,కె, ఎ, సోడియం, పొటాషియం, వంటి పోషకాలు ఉంటాయి.
ప్రతిరోజు ద్రాక్ష పండ్లను ఇలా తీసుకోండి..
ద్రాక్షను ప్రతిరోజు జ్యూస్‌లాగా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ద్రాక్ష పండ్ల జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక కప్పు ద్రాక్ష పండ్లను తీసుకుని శుభ్రంగా కడగాలి. వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఒక గ్లాస్ నీటిని పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. జార్ లోకి తీసుకుని ఒక గ్లాస్ నీటిని పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ జ్యూస్ ను వడకట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత తేనెను వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్టాయిలు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
❈ ఈ జ్యూస్‌ను తాగడం వల్ల అజీర్తి, మలబద్దకం సమస్యలు తగ్గడంతో పాటు జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది.
❈ ఇన్ఫెక్షన్ ల బారిన పడే వారు ఈ జ్యూస్ ను తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
❈ ద్రాక్ష జ్యూస్ ను తాగడం వల్ల వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తాయి.
❈ ఈ పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో మెటాబాలిజం రేటు పెరుగుతుందని నిపుణులు.
❈ ద్రాక్ష జ్యూస్ తాగడం వల్ల శరీరంలో విష పదార్థాలు తొలగిపోతాయి.
❈ ద్రాక్ష జ్యూస్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి.
Grape Juice: ద్రాక్ష పండ్లు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..!