Best Time To Eat Orange: నారింజ జ్యూస్‌ను అందరూ ఎంతగానో ఇష్టపడి తాగుతూ ఉంటారు. చలికాలంలో చాలా మంది ఈ జ్యూస్‌లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకోవడం మంచిదేనా? ఈ జ్యూస్‌ను శీతాకాలంలో ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల రకాల ప్రయోజనాలు కలుగుతాయి. జ్యూస్ కంటే పండ్లను తినడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలిగే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మంది నారింజ పండ్లను తీసుకోవడంలో కొన్ని పొరపాట్లు పడుతున్నారు. ఇంతకి చలి కాలంలో నారింజ పండ్లను ఎలా తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నారింజ పండుతో కలిగే లాభాలు:
నారింజలో విటమిన్ సి, బీటా కెరోటిన్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇందులో ఉండే గుణాలు నికరమైన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని నుంచి శరీర కణాలను రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే ఫైబర్ పరిమాణాలు కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, శరీర బరువు కూడా సులభంగా నియంత్రిస్తాయి. దీంతో పాటు కంటి సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఒక రోజులో ఎన్ని నారింజలు తింటే శరీరానికి మంచిది?:
ప్రస్తుతం చాలా మంది నారింజలను అతిగా తీసుకుంటూ ఉంటున్నారు. ఇలా అతిగా తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతి రోజు 2 నుంచి 3 నారింజ పండ్లను తీసుకోవడం చాలా మంచిది. ఇందులో ఫైబర్, విటమిన్ సి కూడా అధిక పరిమాణలంలో లభిస్తాయి.
నారింజ తినడానికి సరైన సమయం?:
నారింజలో విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. కాబట్టి ప్రతి రోజు ఉదయంతో పాటు రాత్రి కూడా నారింజ పండ్ల జ్యూస్‌ను తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
నారింజ ఎలా తినాలి?:
ఆరెంజ్‌లో ఉండే విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తాయి. భోజనానికి ముందు తీసుకోవడం గుండెల్లో మంట వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా నారింజ పండ్లను పాలు, పెరుగు తీసుకున్న తర్వాత తీసుకోకపోవడం చాలా మంచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook