Sreeleela Dance: 'ఓ మై బేబి సాంగ్‌'కు శ్రీలీల అదిరిపోయే స్టెప్పులు, వైరల్ అవుతున్న వీడియో..

Sreeleela Dance Video: శ్రీలీల ఫీమేల్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఇందులో సూపర్ స్టార్ మహేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ఓ బేబీ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేసింది శ్రీలీల, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్ లో ఉంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2023, 09:58 PM IST
Sreeleela Dance: 'ఓ మై బేబి సాంగ్‌'కు శ్రీలీల అదిరిపోయే స్టెప్పులు, వైరల్ అవుతున్న వీడియో..

Sreeleela Dances To Oh My Baby Song: సూపర్ స్టార్ మహేశ్ బాబు నయా మూవీ 'గుంటూరు కారం'(Guntur Kaaram). ఇది మహేష్ కెరీర్ లో 28వ చిత్రం. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో లేటెస్ట్ సెన్షేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆడియెన్స్ లో ఎనలేని హైప్ క్రియేట్ చేశాయి. డిసెంబరు 13న సెకండ్ సింగిల్ ఓ మై బేబీ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట దుమ్ములేపుతోంది. తాజాగా ఇదే పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది శ్రీలీల (Sreeleela). ఇప్పుడు ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను శిల్పారావు అలపించారు. 

మహేశ్ టైటిల్ రోల్ చేస్తున్న గుంటూరు కారం మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రానికి ఎస్‌ థమన్ మ్యూజిక్ అందించారు. ఈ మూవీని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్‌ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా అంటే జనవరి 12, 2024 నాడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. అతడు, ఖలేజా తర్వాత మహేశ్‌, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై వీర లెవల్లో అంచనాలు ఉన్నాయి. ఇందులో జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరాం, సునీల్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. 

మహేశ్ తన తర్వాత సినిమాను రాజమౌళితో చేయనున్నారు. విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే కథగా ఉండబోతుందని తెలుస్తోంది. మరోవైపు శ్రీలీల పవన్ కల్యాణ్‌ సరసన ఉస్తాద్ భగత్ సింగ్‌లో ఫీమేల్ లీడ్ లో నటిస్తోంది. నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న అనగనగా ఒకరోజులో కూడా శ్రీలీలే హీరోయిన్. 

Also read: Unstoppable With Nbk: బాలయ్య షోకు అలనాటి అందాల తారలు.. ప్రోమో మామూలుగా లేదు భయ్యా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News