Drohi Movie Review: ద్రోహి సినిమా రివ్యూ.. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించే కథ

Drohi The Criminal Movie Review and Rating: సందీప్ బొడ్డపాటి, దీప్తి వర్మ ప్రధాన పాత్రల్లో విజయ్ దాస్ పెందుర్తి దర్శకత్వంలో రూపొందిన మూవీ దోహ్రి. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందంటే..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2023, 06:20 PM IST
Drohi Movie Review: ద్రోహి సినిమా రివ్యూ.. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించే కథ

Drohi The Criminal Movie Review and Rating: సినిమా పేరు: ద్రోహి ది క్రిమినల్  

తారాగణం : సందీప్ బొడ్డపాటి, దీప్తి వర్మ, షకలక శంకర్, మజిలీ శివ, మహేష్ విట్ట, డెబ్బి.
సంగీతం : అనంత నారాయణ ఏ.జి
నిర్మాణం: ప్లే వరల్డ్ క్రియేషన్స్, సాఫిరస్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్స్, గుడ్ ఫెల్లోస్ మీడియా సంయుక్తంగా.
నిర్మాతలు: రాజశేఖర్ రవి పూడి, శ్రీకాంత్ రెడ్డి దుగ్గెంపూడి.
దర్శకుడు: విజయ్ దాస్ పెందుర్తి

కథ: హీరో సందీప్ (అజయ్) ఒక బిజినెస్ మ్యాన్. తన ఇద్దరి స్నేహితులతో కలిసి వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే చేసే ప్రతి బిజినెస్‌ ఫెయిల్ అవుతూనే ఉంటుంది. బిజినెస్ ఫెయిల్ అవుతున్నా.. తన భార్య హీరోయిన్ దీప్తి వర్మ (చంద్రిక) తనకు సపోర్టుగా ఉంటుంది. ప్రతి వ్యాపారం ఫెయిల్ అవ్వడం రెండేళ్లుగా తీవ్ర ఒత్తిడిలో ఉంటాడు అజయ్. అలా సాగిపోతున్న అజయ్ జీవితంలో అనుకొని సంఘటన జరిగి చంద్రిక చనిపోతుంది. తన భార్యను చంపిన కేసులో అజయ్‌ను సస్పెక్ట్‌గా అరెస్టు చేస్తారు. ఆ కేసు నుంచి హీరో బయట ఎలా పడ్డాడు అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ: దర్శకుడు కథని ఎంచుకున్న తీరు స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. దర్శకుడు ప్రతి క్యారెక్టర్‌ను మలిచిన తీరు అద్భుతం. ముఖ్యంగా షకలక శంకర్‌లో ఒక కొత్త నటుడి ని చూపించారు. ఈ సినిమాలో ఒక లీడ్ రోల్ చేసిన హీరోయిన్ డెబ్బి ఇంతకుముందు చేసిన రోల్‌కి భిన్నంగా సాఫ్ట్ క్యారెక్టర్‌లో కనిపించారు. మ్యూజిక్ లైట్‌గా ఉంటూనే సినిమాపైన ఆసక్తిని పెంచుతుంది. హీరో సందీప్ నటన, అతని పాత్రని చూపించిన విధానం చాలా బాగున్నాయి. షకలక శంకర్  రోల్ చాలా ఆసక్తి గా  ఉంటుంది. హీరో ఫ్రెండ్స్ గా మహేష్ విట్ట, నీరోజ్ పుచ్చ రోల్స్ ఆకట్టుకున్నాయి.

ప్లస్ పాయింట్లు: చిన్న సినిమా అయినా చాలా గ్రాండ్‌గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు. షకలక శంకర్ కారెక్టర్ నటన అద్భుతంగా ఉన్నాయి. హీరో సందీప్ మొదటి సినిమా అయినా ప్రామిసింగ్‌గా చాలా బాగుంది. మహేష్ విట్ట నటన చాలా బావుంది. చాందిని, మజిలీ శివ, దీప్తి వర్మ తమ పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ : రొటీన్ కథ, మ్యూజిక్.
ఈ సినిమా థ్రిల్లర్స్, సస్పెన్స్ ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి కచ్చితంగా నచ్చుతుంది.
రేటింగ్ : 2.7/5

Also Read: IND Vs SL Highlights: శ్రీలంకకు టీమిండియా అదిరిపోయే పంచ్.. సెమీస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ..!  

Also Read: Skin Care Tips: ఈ పదార్ధాలు దూరం చేయకుంటే మీ చర్మం కాంతి విహీనంగా అందవికారంగా మారడం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News