India vs Bangladesh Pitch Report and Weather Forecast: వరల్డ్ కప్‌లో టీమిండియా మంచి జోష్‌లో ఉంది. వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతుంది. రేపు బంగ్లాదేశ్‌తో నాలుగో మ్యాచ్‌లో తలపడనుంది. గురువారం పూణెలోని ఎంసీఏ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభంకానుంది. మూడు మ్యాచ్‌లో విజయం సాధించి భారత్ జోరు మీద ఉండగా.. రెండు ఓటములు, ఒక గెలుపుతో బంగ్లాదేశ్ పాయింట్ల పట్టికలో ఏడోస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్‌లపై భారత్ గెలుపొందగా.. అఫ్ఘాన్‌పై గెలుపొందిన బంగ్లా.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌ల చేతిలో ఓడిపోయింది.
ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు మ్యాచ్‌లకు వరుణుడు పెద్దగా అంతరాయం కలిగించలేదు. ధర్మశాలలో మాత్రం వర్షం కారణంగా దక్షిణాఫ్రికా vs నెదర్లాండ్స్ మ్యాచ్ 43 ఓవర్లకు కుదించారు. అయితే భారత్-బంగ్లా మ్యాచ్‌కు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. గురువారం పుణేలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి..? పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది..? వర్షం ప్రభావం చూపుతుందా..? వివరాలు ఇలా..
తిరోగమన రుతుపవనాల కారణంగా మనదేశంలోని కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే పుణెలో గురువారం మ్యాచ్‌కి వర్షం ముప్పు లేదు. మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు 32°Cకి చేరి.. ముగింపు దశల్లో 25°Cకి తగ్గుతోంది. అదేవిధంగా పూణేలో రాత్రి వేళ మంచుకురిసే అవకాశం లేదు. అంటే ఛేజింగ్ జట్టుకు అదనపు ప్రయోజనం ఉండదు.
పూణెలోని MCA స్టేడియంలో మొత్తం 11 పిచ్‌లు ఉన్నాయి. అన్నీ నల్ల మట్టితో తయారుచేశారు. ప్రపంచ కప్ మ్యాచ్‌ల కోసం 11 వికెట్లలో 4 మాత్రమే ఉపయోంచనున్నారు. పిచ్‌పై మంచి బౌన్స్ ఉంటుంది. ఈ వేదికపై గతంలో జరిగిన ఏడు వన్డేల్లో 5 జట్లు మొదట బ్యాటింగ్ చేసినప్పుడు 300 కంటే ఎక్కువ పరుగులు చేశాయి. పూణెలోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఛేజింగ్ జట్లు కూడా గత ఏడు మ్యాచ్‌ల్లో 300కు పైగా పరుగులు చేశాయి. మొదటి ఇన్నింగ్స్ స్కోరు 307 పరుగులుగా ఉంది. ఈ పిచ్‌పై పేసర్లు పండగ చేసుకుంటారు.
చివరి ఏడు మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 4 విజయాలు సాధించగా.. ఛేజింగ్ జట్లు 3 మ్యాచ్‌లు గెలిచాయి. అయితే ఇప్పటివరకు 300+ లక్ష్యాలను రెండుసార్లు ఛేదించడం విశేషం. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గు చూపే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: NED VS SA: వరల్డ్ కప్ లో మరో సంచలనం.. సౌతాఫ్రికాకు షాకిచ్చిన నెదర్లాండ్స్..
ఇది కూడా చదవండి: చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్.. ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న బన్నీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
IND vs BAN World Cup 2023: రేపే బంగ్లాదేశ్‌తో భారత్ పోరు.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందా..? పిచ్ రిపోర్ట్ ఇలా..!