Jawan OTT Release: జవాన్ ఓటీటీ రిలీజ్ ఫిక్స్, ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే

Jawan OTT Release: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ ఇంకా కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. రోజురోజుకూ బాక్సాఫీసు వద్ద రికార్డులు బద్దలౌతున్నాయి. కొత్తవి క్రియేట్ అవుతున్నాయి. ఈ మెగా హిట్ మూవీ జవాన్ గురించి క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వెలువడింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 7, 2023, 01:30 PM IST
Jawan OTT Release: జవాన్ ఓటీటీ రిలీజ్ ఫిక్స్, ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే

Jawan OTT Release: ఎంతటి హిట్ సినిమా అయినా ఓటీటీలో విడుదల కావల్సిందే. ఓటీటీ క్రేజ్ అలాంటిది. షారుక్ ఖాన్ సూపర్ సెన్సేషనల్ హిట్ జవాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్ ఇది. త్వరలో ఆ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. 

మల్టీ లాంగ్వేజ్ సినిమా, సూపర్ సెన్సేషనల్ హిట్ జవాన్ ఇంకా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. బాక్సాఫీసు వద్ద భారీగా కలెక్షన్లు సృష్టిస్తూనే ఉంది. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా 1103 కోట్లు వసూలు చేసింది. ఒక్క హిందీలోనే ఈ సినిమా 560 కోట్లు వసూలు చేయగా ఇతర భాషల్లో 60 కోట్లు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ కలెక్షన్లు 369 కోట్లు ఉన్నాయి. 

తమిళ దర్శకుడు అట్లి దర్శకత్వం వహించిన జవాన్ సినిమాలో హీరోగా షారుక్ ఖాన్, హీరోయిన్‌గా నయనతార నటించగా విలన్ పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. ఇక ఇతర పాత్రల్లో దీపికా పదుకోన్, బిగ్‌బాస్ సిరి, సంజయ్ దత్, సునీల్ గ్రోవర్, ప్రియమణి తదితరులు నటించారు. ఇప్పుడి సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా అని ఓటీటీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో గుడ్‌న్యూస్ అందింది. జవాన్ సినిమా ఓటీటీ వేదిక దాదాపుగా ఖరారైంది. 

ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ జవాన్ సినిమా హక్కుల్ని 250 కోట్ల సొంతం చేసుకుందని సమాచారం. నవంబర్ 2వ తేదీన ఓటీటీలో విడుదల కావచ్చని తెలుస్తోంది. 

Also read: Deepthi Sunaina: బెడ్‌పై దీప్తి సునైనా అందాలతో విందు.. నెటిజన్ల ప్యూజులు ఔట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News