BRS MLA Candidates List: బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన.. సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్

CM KCR Announces BRS Candidates List Live Updates: అసెంబ్లీ ఎన్నికలకు తన టీమ్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల జాబితా కోసం ఇక్కడ చెక్ చేయండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితా ఇలా.

Written by - Ashok Krindinti | Last Updated : Aug 21, 2023, 04:24 PM IST
BRS MLA Candidates List: బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన.. సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్
Live Blog

CM KCR Announces BRS Candidates List Live Updates: బీఆర్ఎస్ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్కంఠకు తెర పడింది. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఫస్ట్‌ లిస్టులో భాగంగా 115 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు గులాబీ బాస్. వీరిలో ఎక్కువ శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు దక్కాయి. అయితే కొన్ని చోట్ల ఇష్టం లేకపోయినా.. అభ్యర్థులను మార్చాల్సి వచ్చిందని తెలిపారు కేసీఆర్. అయితే పెద్దగా మార్పులు లేకుండానే ఎన్నికలకు వెళుతున్నట్లు ప్రకటించారు.  
 

21 August, 2023

  • 16:11 PM

    బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

     

  • 15:34 PM

    రానున్న తెలంగాణ శాసనసభ ఎన్నికలకు కేసీఆర్ టీమ్ ఇదే.. ఫస్ట్ లిస్టులో పేర్లు

     

  • 15:30 PM

    ==> కోరుట్ల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్ కుమారుడిటి సీటు కేటాయింపు
    ==> సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురికి టి
    కెట్
     

  • 15:27 PM

    నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కరించేందుకు త్రీమెన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. పరిస్థితులను బట్టి అభ్యర్థులను మారుస్తామని అన్నారు. 
     

  • 15:23 PM

    ==> బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన సందర్భంగా సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్ 
    ==> క్రమశిక్షణ ఉల్లంఘిస్తే పార్టీ నుంచి బయటకు పంపించేస్తాం.. 
    ==> 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని ధీమా 
    ==> నేతల్లో అసమ్మతి సర్దుకుంటుందని ఆశాభావం 
    ==> నాయకుల కోరిక మేరకే కామారెడ్డిలో పోటీ చేస్తున్నా..
    ==> ఎం‌ఐఎం‌ మాకు మిత్రపక్షం

  • 15:16 PM

    ==> స్టేషన్‌ఘన్‌పుర్, ఉప్పల్, వేములవాడ, వైరా, ఖానాపూర్, బోథ్‌, కామారెడ్డి అభ్యర్థులు మార్పు..
    ==> నర్సాపూర్, జనగా, గోషామహల్, నాంపల్లి సీట్లు ఇంకా ప్రకటించలేదు. 

  • 15:11 PM

    అక్టోబర్ 16న వరంగ్‌లో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అదే రోజు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించనున్నారు.
     

  • 15:04 PM

    ==> కామ్రేడ్లకు కేసీఆర్  మొండి చేయి 
    ==> సీపీఐ, సీపీఎం అడుగుతున్న స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్ 
    ==> గత కొంతకాలంగా పొత్తుల కోసం ఎదురు చూస్తున్న వామపక్షాలు 
    ==> వామపక్షాల ప్రతిపాదనలు పట్టించుకోని బీఆర్ఎస్‌
    ==> బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనతో ఇక వామపక్షలతో పొత్తు లేనట్టే..?

  • 15:03 PM

    తాను రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.
     

  • 15:02 PM

    ==> ఏడుగురు సిట్టింగులకు టికెట్ల నిరాకరణ
    ==> వైరా, అసిఫాబాద్, బొద్, ఉప్పల్ స్థానాల్లో మార్పు
    ==> దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి 
    ==> వేములవాడ చల్మెడ ఆనందరావు పేరు ఖరారు 
    ==> కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజకవర్గాల నుంచి సీఎం కేసీఆర్ పోటీ 
    ==> హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి పేరు
    ==> కోరుట్ల అభ్యర్థి మార్పు 

Trending News