Mint Green Tea Side Effects: వేసవిలో శరీరాన్ని చల్లబరుచుకోవడానికి చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. ముఖ్యంగా చాలా మంది పుదీనాతో తయారు చేసిన డ్రింక్స్ తీసుకుంటున్నారు. అయితే పుదీనా అధికంగా ఉండే డ్రింక్స్ అతిగా తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పుదీనా తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలున్న కొంది సందర్భాల్లో దీనితో తయారు చేసిన టీలను అతిగా తీసుకోవడం వల్ల చాలా రకాల దుష్ప్రభావాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా టీ తాగడం వల్ల కలిగే నష్టాలు:
జీర్ణక్రియ సమస్యలు వస్తాయి:
ప్రతి రోజు నాలుగు కప్పుల కంటే అతిగా పుదీనా టీని తాగితే తీవ్ర జీర్ణక్రియ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఆకుల్లో మెంథాల్ అనే మూలకం అధిక పరిమానంలో లభిస్తుంది. కాబట్టి అతిగా తాగడం వల్ల పొట్ట సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.
Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్
అలర్జీ:
ఎలాంటి కారణాలు లేకుండా అలర్జీ సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు అతిగా పుదీనా టీని తాగడమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కొన్ని సార్లు ఈ టీని అతిగా తాగడం కారణంగా తల నొప్పులు, నోటిలో పూతలు వంటి సమస్యలు కూడా రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
పొట్టలో సమస్యలు:
పుదీనా టీ తాగడం కడుపులో తిమ్మిర్లు, వణుకు, విరేచనాలు వంటి పొట్ట సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చాలా మందిలో ఈ టీని అతిగా తాగడం వల్ల కండరాల సమస్యలు కూడా రావొచ్చు.
మధుమేహం ఉన్నవారు తాగొచ్చా?:
డయాబెటిస్తో బాధపడుతున్నవారు ఈ టీని తీసుకునే ముందు వైద్యుల సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ పుదీనా టీని అతిగా తాగకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీరు ఈ టీని అతిగా తాగడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే ఛాన్స్ కూడా ఉంది.
Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook