Sunil Gavaskar Says Please Give Credit To Rohit Sharma also like MS Dhoni: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లు ఏవంటే.. సగటు క్రికెట్ అభిమాని ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అని టక్కున చెప్పేస్తారు. ఎందుకంటే ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ముంబై ఐదు టైటిల్స్ గెలవగా.. చెన్నై నాలుగు గెలిచింది. గత ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన చేసిన రెండు జట్లు పుంజుకుని ఐపీఎల్ 2023లో టైటిల్ రేసులో నిలిచాయి. అయితే చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీకి వచ్చినంత పేరు ముంబై సారథి రోహిత్ శర్మకు రాలేదు. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు.
ఐపీఎల్ 2023 ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ బౌలర్ అకాశ్ మధ్వాల్ అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. కేవలం 5 పరుగులు ఇచ్చి ఏకంగా 5 వికెట్స్ పడగొట్టాడు. గాయాల కారణంగా స్టార్ పేసర్లు ఐపీఎల్ 2023కి దూరం అయిన నేపథ్యంలో మధ్వాల్‌కు ముంబై సారథి రోహిత్ శర్మ అవకాశం ఇచ్చి ప్రోత్సహించాడు. దాంతో రోహిత్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఇలాంటి విషయాల్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీకి వచ్చినంత పేరు హిట్‌మ్యాన్‌కు వస్తుందని తాను అనుకోవడం లేదని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'నిజానికి రోహిత్ శర్మపై అంచనాలు పెద్దగా ఉండవు. అయితే ముంబై జట్టుకు ఐదు టైటిళ్లు అందించాడు. ఓ ఉదాహరణ చెబుతా.. ఆకాష్ మధ్వాల్ ఓవర్ ది వికెట్ బంతిని సంధించి ఆయూష్ బదోనీ వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాతి బంతికే లెఫ్ట్ హ్యాండర్ అయిన నికోలస్ పూరన్ వికెట్‌ను రౌండ్ ది వికెట్ ద్వారా తీశాడు. చాలా మంది బౌలర్లు ఇలా చేయరు. ఓవర్ ది వికెట్ బౌలింగ్ చేస్తూ లయను సాధించినప్పుడు.. లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్‌మన్ అయినా సరే బౌలింగ్ శైలిని మార్చుకోరు. అయితే మధ్వాల్ రౌండ్ ది వికెట్ మీదుగా అధ్భుతంగా బంతిని సంధించి వికెట్ తీశాడు' అన్నాడు.
ఒకవేళ ఎంఎస్ ధోనీ సారథ్యంలో ఆకాష్ మధ్వాల్ ఇలాంటి ప్రదర్శన చేసి ఉంటే.. మహీ గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవారని, కానీ రోహిత్ శర్మ విషయంలో అలా జరగదు అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. 'ఎంఎస్ ధోనీ సారథ్యంలో ఇలా జరిగితే నికోలస్ పూరన్‌ను ఔటు చేసేందుకు మహీ వ్యూహ రచనను అందరూ గొప్పగా చెప్పేవారు' అని గవాస్కర్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. 'ముంబై బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆకాష్ వధేరాను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సాధారణంగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటర్లను తీసుకోరు. రోహిత్ మాత్రం ఆ నిర్ణయం తీసుకుని సక్సెస్ అయ్యాడు. కాబట్టి అతడికీ క్రెడిట్ ఇవ్వాలి' అని సన్నీ కోరాడు. నేడు గుజరాత్‌తో ముంబై రెండో క్వాలిఫయర్‌లో తలపడుతోంది.
Also Read: Hyundai Exter Launch: హ్యుందాయ్ ఎక్స్‌టర్ వచ్చేస్తుంది.. 11 వేలకు బుకింగ్! ఇక టాటా పంచ్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు
Also Read: Simple One Electric Scooter: సింపుల్ వన్ ఈవీ వచ్చేసింది.. సింగిల్ ఛార్జింగ్‌పై 212 కిమీ ప్రయాణం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.