Dark Circles Remedies: చాలామందికి కంటి చుట్టూ నల్లటి వలయాలు లేదా డార్క్ సర్కిల్స్ అతి పెద్ద సమస్యగా మారుతుంటాయి. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఎన్ని క్రీమ్స్ వాడినా ప్రయోజనం కన్పించక నిరాశపడుతుంటారు. ముఖం అందం కోల్పోయి నలుగురిలో అసౌకర్యంగా ఉంటుంది. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు కొన్ని అద్భుతమైన చిట్కాలున్నాయంటున్నారు బ్యుటీషియన్లు.
వాస్తవానికి కంటి చుట్టూ నల్లటి వలయాలు లేదా మచ్చలు ఏర్పడటం అనేది అనారోగ్య సమస్య కానేకాదు. ఇది జీవన విధానం వల్ల తలెత్తె సమస్య మాత్రమే. కళ్లు అలసినట్టు కన్పిస్తుంటాయి. డార్క్ సర్కిల్స్ కారణంగా వృద్ధాప్య లక్షణాలు కన్పిస్తాయి. వయస్సు తక్కువే అయినా బ్లాక్ సర్కిల్స్ కారణంగా వయసు మీదపడినట్టుగా ఉంటుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఆలోచించాల్సి ఉంటుంది. లేకపోతే ముఖ సౌందర్యం దెబ్బతిని తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు. ముఖం అందం దెబ్బతింటుంది. తెల్లగా ఉండేవారిలో అయితే ఈ సమస్య మరింతగా కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది. ఈ క్రమంలో ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు చిట్కాలు చాలా ఉన్నాయి. డార్క్ సర్కిల్స్ పోగొట్టుకునేందుకు మార్కెట్లో లభించే క్రీమ్స్ కంటే సహజసిద్దమైన పద్ధతులే ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.
డార్క్ సర్కిల్స్ సమస్యను సహజసిద్ధమైన పద్ధతిలో పరిష్కరించేందుకు కీరా అద్భుతంగా పనిచేస్తుంది. చల్లగా ఉన్న కీరాను స్లైసెస్‌గా చేసుకుని వాటిని రెండు కళ్లపై 10-15 నిమిషాలు ఉంచుకోవాలి. ముఖ్యంగా డార్క్ సర్కిల్స్ ఉండే చోట కీరా ముక్కల్ని ఉంచాలి. ఇలా ప్రతిరోజూ 2-3 వారాలు చేస్తే మంచి ఫలితాలుంటాయి.
టీ బ్యాగ్స్ థెరపీ కూడా ప్రాచుర్యంలో ఉన్న అద్భుతమైన విధానం. డార్క్ సర్కిల్స్ సమస్యను పరిష్కరించేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం కెఫీన్ ఉండే టీ బ్యాగ్స్‌ను ముందు వేడి నీళ్లలో ఉంచాలి. ఆ తరువాత కాస్సేపు వాటిని ఫ్రిజ్‌లో పెట్టాలి. కూల్ అయిన టీ బ్యాగ్స్‌ను రెండు కళ్లపై 5-10 నిమిషాలపాటు ఉంచాలి. ఇలా రోజూ చేయడం వల్ల 2 వారాల్లోనే డార్క్ సర్కిల్స్ సమస్య తొలగిపోతుంది.
నిద్రలేమి, తీవ్రమైన అలసట కూడా కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడటానికి కారణాలు. మీ ముఖ చర్మం పసుపుగా మారిపోతుంది. ఫలితంగా కంటి కింద మచ్చలు మచ్చలుగా కన్పిస్తుంది. రోజూ రాత్రి వేళ కచ్చితంగా 8 గంటలు సుఖమైన నిద్ర ఉండేట్టు చూసుకోవాలి. నిద్ర సరిగ్గా ఉంటే ఈ సమస్య చాలా వరకూ తొలగిపోతుంది. నిద్రలేకుండా ఎన్ని చిట్కాలు పాటించినా పెద్దగా ప్రయోజనముండదు.
మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు కొద్దిపాటి ఎండ అవసరం. ఎండ ద్వారా లభించే సహజసిద్ధమైన విటమిన్ డి మరెక్కడా లభించదు. ఇది ఆరోగ్యానికి, శరీర నిర్మాణం, ఎదుగుదలకు కీలకం. కానీ ముఖంపై నేరుగా సూర్య కిరణాలు పడకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే ట్యానింగ్, డార్క్ సర్కిల్స్ వంటి సమస్యలు ఏర్పడతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook