Tomato Benefits: చలికాలం టమోటా చేసే మేలు.. తల్లికూడ చేయదట..

Tomato Benefits In Winter: టమోటాలను రోజు తినడం వల్ల శరీరానికి శరీరానికి వివిధ రకాల పోషకాలు లభిస్తాయి. దీని కారణంగా గుండె సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే క్యాన్సర్‌ కణాలు కూడా తగ్గుతాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Dec 4, 2024, 06:40 PM IST
Tomato Benefits: చలికాలం టమోటా చేసే మేలు.. తల్లికూడ చేయదట..

Tomato Benefits In Winter: టమోటా పోషకాల నిధిగా పిలుస్తారు. ఇందులో శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా టమోటాల్లో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ, విటమిన్ బి విటమిన్లు (B1, B3, B5, B6, B7)లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు ఆహారాల్లో దీనిని వినియోగించడం వల్ల వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో పొటాషియం, ఐరన్‌, మెగ్నీషియం, క్రోమియం, కోలిన్, జింక్, ఫాస్ఫరస్‌తో పాటు ఇతర ఖనిజాలు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి రోజు తీసుకోవడం వల్ల గుండె సమస్యల నుంచి ఇతర లాభాలు కలుగుతాయి. ఇవే కాకుండా శరీరానికి కలిగే ఇతర లాభాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.  

టమోటాలు తినడం వల్ల కలిగే 8 ప్రధాన లాభాలు:
గుండె ఆరోగ్యానికి మేలు: 

టమోటాలో శరీరానికి అవసరమైన  శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. కాబట్టి రోజు తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా సులభంగా తగ్గుతుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు రక్తనాళాలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులైనా దూరమవుతాయి. 

క్యాన్సర్ కణాలకు చెక్‌: 
టమోటాలో ఉండే కొన్ని గుణాలు లైకోపీన్ ప్రోస్టేట్, కొలొరెక్టల్ క్యాన్సర్ కణాల ప్రమాదాన్ని నివారించేందుకు కూడా సహాయపడుతుంది. దీంతో పాటు ఇందులో లభించే యాంటీ ఆక్సిడెంట్లు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి. 

చర్మం ఆరోగ్యం: 
టమోటోలోని విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ఇవి చర్మాన్ని మెరుగుపరిచేందుకు ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ప్రతి రోజు టమోటోలను తినడం వల్ల మచ్చలు, ఇతర సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. 

కంటి ఆరోగ్యం: 
టమోటాలోని ల్యుటిన్, జియాక్సాంథిన్ అనే కెరోటినాయిడ్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి మన కళ్ల హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి రక్షించేందుకు సహాయపడుతుంది. అలాగే మాక్యులర్ డిజీజ్, గ్లాకోమా వంటి కంటి సమస్యలను నివారిస్తుంది. 

జీర్ణ వ్యవస్థకు మేలు: 
టమోటాలో ఫైబర్‌ కూడా ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి రోజు తింటే మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. దీంతో పాటు జీర్ణక్రియ కూడా శక్తివంతంగా తయారవుతుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి. 

ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్‌ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్‌ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్‌ అదేనా?

బరువు నియంత్రణ: 
టమోటాలో కేలరీలు తక్కువగా.. ఫైబర్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది. ఇది పొట్టను ఎక్కువ సేపు నిండుగా ఉంచేలా చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News