Lemon Tea Recipe For Effective Weight Loss: రోజు ప్రతి ఒక్కరు తమ జీవితాన్ని ఉదయం పూట టీతో ప్రారంభిస్తారు. ప్రతిరోజు టీని దాదాపు నాలుగు నుంచి ఐదు సార్లు అయినా తాగుతూ ఉంటారు. ముఖ్యంగా ఆఫీసుల్లో పనిచేసే వారైతే లెక్క లేకుండా తాగుతారు. ప్రతిరోజు పాలతో తయారుచేసిన టీ ని తాగడం వల్ల భవిష్యత్తులో అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని కొంతమంది గ్రీన్ టీతో పాటు లెమన్ టీలను తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రతిరోజు పాలతో తయారుచేసిన టీకి బదులుగా లెమన్ టీని తాగడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. నిమ్మ లో ఉండే ఔషధ గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను సైతం శరీరం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి చాలామంది నిమ్మలోని ప్రయోజనాలను గుర్తు పెట్టుకుని లెమన్ టీ ని తాగుతున్నారు. ఈ టీని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేసుకుంటారు. అయితే మీరు కూడా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా..? మేమందించిన ఈ సులభమైన పద్ధతిని వినియోగించి లెమన్ టీ ని తయారు చేసుకోండి.
లెమన్ టీ రెసిపీకి కావలసిన పదార్థాలు:
❀ 1 కప్పు నీరు
❀ 1 టీస్పూన్ టీ పొడి
❀ 1/2 నిమ్మకాయ
❀ 1 టీస్పూన్ పంచదార (రుచికి సరిపడా)
❀ 1 టీస్పూన్ తేనె (రుచికి సరిపడా)
తయారీ విధానం:
❀ ముందుగా స్టవ్ పై చిన్న టీ బౌల్ పెట్టుకొని అందులో ఒక కప్పు నీటిని మరిగించండి.
❀ ఆ నీరు మరిగిన తర్వాత, టీ పొడి వేసి 2 నిమిషాల పాటు బాగా ఉడికించాల్సి ఉంటుంది.
❀ ఇలా మరిగించిన టీ డికాషన్ ను ఒక గ్లాసులో వడకట్టుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
❀ అదే టీ డికాషన్ లో నిమ్మరసం, పంచదార, తేనెను కలిపి సర్వ్ చేసుకుంటే చాలు. ఎంతో రుచికరమైన లెమన్ టీ ని పొందడం ఖాయం.
చిట్కాలు:
❀ ఈ లెమన్ టీ ని మరింత రుచిగా తయారు చేసుకోవడానికి.. టీ డికాషన్ ను మరిగించే క్రమంలో దాల్చిన, యాలకులు, లవంగాలు వంటి మసాలా దినుసులను కూడా వేసుకోవచ్చు.
❀ మీరు టీని మరింత ఆరోగ్యకరంగా చేయాలనుకుంటే, పంచదారకు బదులుగా తేనెను వాడండి.
❀ అలాగే ఈ లెమన్ టీ ని మరింత లెమన్ ఫ్లేవర్ యాడ్ చేసుకోవడానికి నిమ్మ తొక్కలను డికాషన్ లో వేసి మరిగించుకోవచ్చు.
ఆరోగ్య ప్రయోజనాలు:
❀ నిమ్మ టీలో ఉండే విటమిన్ సి శరీర శక్తిని పెంచుతుంది. కాబట్టి తరచుగా ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఉదయం పూట ఈ టీని తీసుకోండి
❀ నిమ్మ టీలో ఉండే పోషకాలు శరీరంలోని యాంటీఆక్సిడెంట్లు దెబ్బతినకుండా కాపాడతాయి.
❀ అలాగే నిమ్మ టీని ఈరోజు తాగడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
❀ ఈ టీలో ఉండే గుణాలు శరీర బరువును నియంత్రించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా చర్మ సమస్యలను తగ్గించేందుకు కూడా కీలకపాత్ర పోషిస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి