Home Remedies For Glowing Skin In Summer: వేసవిలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడం కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చాలామందిలో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. శరీరం ఎండ కారణంగా డిహైడ్రేషన్ కు గురై.. చర్మం పై నల్లని వలయాలు ఏర్పడి అంద హీనంగా కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి, వచ్చిన సులభంగా తగ్గించుకోవడానికి సౌందర్య నిపుణులు సూచించిన తేనెతో తయారుచేసిన ఫేస్ స్క్రబ్ ను వినియోగించాల్సి ఉంటుంది. దీనిని వినియోగించడం వల్ల చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. దీంతో చర్మం అందంగా.. మెరిసేలా, మృదువుగా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ స్క్రబ్ ను తయారు చేయడానికి ఏయే పదార్థాలు వినియోగించాలో, ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
తేనె ఫేస్ స్క్రబ్ కి కావాల్సిన పదార్థాలు:
రెండు టీ స్పూన్ల తేనె
రెండు టీ స్పూన్ల శెనగపిండి
తగినంత చక్కెర
మిశ్రమంలో తయారు చేసుకోవడానికి నీరు
Also Read: Shraddha Das Photos: తళుకుబెళుకుల డ్రెస్సులో కైపెక్కిస్తున్న శ్రద్దా దాస్
హనీ ఫేస్ స్క్రబ్ తయారీ విధానం:
ఈ పేస్ స్క్రబ్ ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న గిన్నెను తీసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత అందులో రెండు టీ స్పూన్ల శెనగపిండి, రెండు టీ స్పూన్ల తేనె, రెండు టీ స్పూన్ల చక్కెర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో తగినంత నీరును వేసుకొని ఫైన్ గా మిక్స్ చేసుకొని.. చివరకు మిశ్రమంలో తయారు చేసుకోవాలి.
హనీ ఫేస్ స్క్రబ్ వినియోగించే పద్ధతి:
ముందుగా ఈ ఫేస్ స్క్రబ్ వినియోగించడానికి ముఖాన్ని బాగా కడుక్కోవాలి.
ఆ తర్వాత స్క్రబ్ ను ముఖానికి అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి.
ఇలా మర్దన చేసిన తర్వాత 20 నిమిషాలు స్క్రబ్ ను ఆరనివ్వాలి.
ఇలా ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సులభంగా మంచి ఫలితాలు పొందుతారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: Shraddha Das Photos: తళుకుబెళుకుల డ్రెస్సులో కైపెక్కిస్తున్న శ్రద్దా దాస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి