Flaxseed and Aloevera Mask: అవిసెగింజలు- కలబంద మాస్క్‌తో జుట్టు స్ట్రెయిట్‌గా.. పొడుగ్గా పెరుగుతూనే ఉంటుంది..

Flaxseed and Aloevera Mask:అవిసె గింజల్లో ఎన్నో కావాల్సిన పోషకాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.  ఇది జుట్టుకు కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది కుదుళ్ల నుంచి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో విటమిన్స్, ప్రోటీన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది.

Written by - Renuka Godugu | Last Updated : Apr 21, 2024, 08:18 AM IST
Flaxseed and Aloevera Mask: అవిసెగింజలు- కలబంద మాస్క్‌తో జుట్టు స్ట్రెయిట్‌గా.. పొడుగ్గా పెరుగుతూనే ఉంటుంది..

Flaxseed and Aloevera Mask: అవిసె గింజల్లో ఎన్నో కావాల్సిన పోషకాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.  ఇది జుట్టుకు కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది కుదుళ్ల నుంచి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో విటమిన్స్, ప్రోటీన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది.

ఫ్లాక్స్‌ సీడ్ జుట్టుకు వాడటం వల్ల జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. ఇది జుట్టుకు హైడ్రేషన్ అందిస్తుంది. జుట్టు పొడిబారకుండా ఉంటుంది. జుట్టును కుదుర్ల నుంచి దృఢంగా ఉంచుతుంది. అంతేకాదు స్ప్లిట్ ఎండ్ సమస్య రాకుండా కాపాడుతుంది. ఒకవేళ మీరు డాండ్రఫ్ తో బాధపడుతున్నట్లయితే ఫ్లాక్ సీడ్ జెల్‌ఉపయోగించండి ఇది  త్వరగా తొలగిస్తుంది.అంతేకాదు జుట్టును మృదువుగా చేయడంలో ఫ్లాక్సిడ్ కీలకపాత్ర పోషిస్తుంది. 

కలబంద..
కలబంద జుట్టు సమస్యలకు మంచి రెమిడీ కలబందలో విటమిన్ ఏ, సి, ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టుకు రోజంతటికి కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది. జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. కలబందను తరచూ జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు మృదువుగా మాయిశ్చర్ గా మారుతుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.

కలబంద జెల్ వాడటం వల్ల జుట్టు కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. మాయిశ్చర్ గా ఉంచుతుంది డాండ్రఫ్‌ రాకుండా కాపాడుతుంది. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కలబంద సహజసిద్ధమైన కండీషనర్ల పనిచేస్తుంది జుట్టును మృదువుగా మెరిసేలా చేస్తుంది.కలబందలో యాంటీ మైక్రోబ్రియల్ గుణాలు ఉంటాయి. ఇది స్కాల్ప్‌ ఇన్ఫెక్షన్ రాకుండా నివారిస్తుంది. అంతేకాదు హానికరమైన సూర్యకిరణాల నుంచి జుట్టును పాడవకుండా కాపాడుతుంది. 

ఇదీ చదవండి: కలబందని ముఖానికి ఇలా ప్యాక్‌లా వేసుకుంటే పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేదు..

ఫ్లాక్స్‌ సీడ్, కలబంద మాస్క్..
ఫ్లాక్స్‌సీడ్ -1TBSP
కలబంద-1TBSP
నీళ్లు- ఒక కప్పు
కొబ్బరినూనె-1TBSP

ఇదీ చదవండి: ఈ సమ్మర్ కూలింగ్‌ డిటాక్స్‌ డ్రింక్స్‌తో బరువు కూడా ఈజీగా తగ్గిపోతారు..

తయారీ విధానం..
ఈ మాస్క్ తయారు చేయడానికి ఒక పాన్ తీసుకొని అందులో ఫ్లాక్ సీడ్స్ వేసి మీడియం మంట మీద పెట్టి నీళ్లు వేసి మరిగించుకోవాలి. దీని కలుపుతూ ఉండాల్సి ఉంటుంది . జెల్ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చల్లారపర్చాలి.ఇప్పుడు కలబంద వేసి బాగా కలిపి కాటన్ క్లాత్ తో వడకట్టుకోవాలి. కొబ్బరి నూనె కూడా వేసుకోవాలి. ఇప్పుడు మీ జుట్టును పార్టీలుగా విడదీసి ఈ జెల్ ని అప్లై చేసుకుంటూ ఉండాలి. వేళ్ల సహాయంతో లేకపోతే బ్రష్ తో మాస్కుని కుదుళ్ల నుంచి అప్లై చేయాలి. హెయిర్ మాస్కుని కొద్ది నిమిషాల పాటు సర్కులర్ మోషన్ లో రుద్దుతూ ఉండాలి. ఇది బ్లడ్ సర్కులేషన్ కు ప్రోత్సహిస్తుంది. జుట్టు అంతటికి సమానంగా ఎయిర్ మాస్కును అప్లై చేసుకోవాలి. ఒక 30 నిమిషాలు తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News